జైలుకు వెళ్లడంతోనే.. పాపులర్ రాజకీయ నాయకుడిగా మారిన రఘురామ?

frame జైలుకు వెళ్లడంతోనే.. పాపులర్ రాజకీయ నాయకుడిగా మారిన రఘురామ?

praveen
సాధారణంగా రాజకీయాలు అన్న తర్వాత ప్రతి నాయకుడి పై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో అయితే సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక ప్రతిపక్షంలో ఉన్న నాయకులపై.. తమను విమర్శలతో ఇబ్బందులకు గురిచేసిన నాయకులపై కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే మనసులో పెట్టుకుని ఆ నాయకులు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గతంలో తమపై కేసులు పెట్టిన నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం చేస్తూ ఉంటారు. అందుకే నేటితరం రాజకీయాల్లో ఇలా ఒక్క కేసు లేని రాజకీయ నాయకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 అయితే కొంతమంది అప్పటి వరకు సాదాసీదా రాజకీయ నాయకులు గానే పేరుగాంచినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఏకంగా పోలీస్ కేసు నమోదవడం.. ఇక జైలు శిక్ష అనుభవించడం కారణంగా రాష్ట్ర రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. అలాంటి రాజకీయ నాయకుల్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు టిడిపి తరఫున ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకరు.  మొదట్లోవ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న రఘురామకృష్ణంరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 అయితే 2014లో నరసాపురం నుంచి ఎంపీ టికెట్ కోసం ఆశించిన రఘురామకృష్ణం రాజుకు పార్టీ అధిష్టానం నుంచి ముందు చేయి ఎదురయింది. దీంతో వైసిపి నుంచి తప్పుకొని బిజెపిలో చేరారు. ఆ తర్వాత 2018లో బిజెపిని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న ఆయన 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇలా వైసిపి తరఫున గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ అధినేత అప్పటి ముఖ్య మంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు  చేశారు. జగన్ పథకాలను ఇక  వైసిపి ఎమ్మెల్యేలు తీరును ప్రతిపక్షం కంటే ఎక్కువగానే విమర్శలు గుప్పించారు. దీంతో రఘురామకృష్ణం రాజును జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించటం.. ఆయనపై 124(a ) 153 (బి) 505 ఐపిసి, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఆయన అరెస్ట్ చేయడానికి ముందే  సెక్షన్ 50 కింద కుటుంబ సభ్యులకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పుట్టినరోజు నాడే రఘురామకృష్ణం రాజు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇలా వైసీపీ నుంచి గెలిచి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం.. సీఎం జగన్ రఘురామపై కేసులు పెట్టించి జైలుకు పంపించడం ఇలాంటి వ్యవహారాలు.. ఇక రఘురామ కృష్ణంరాజును ఏపీ రాజకీయాల్లో పాపులర్ రాజకీయ నాయకుడిగా మార్చాయ్ అనడంలో ఇలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: