జగన్ కు జనం కష్టాలను పరిచయం చేసిన జైలుశిక్ష.. నవరత్నాలకు అక్కడే బీజం పడిందా?
జగన్ తప్పు చేశారని అందుకే అన్నేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని చాలామంది భావించారు. ఒక విధంగా జగన్ కు జనం కష్టాలను జైలు శిక్ష పరిచయం చేసిందని చెప్పవచ్చు. జగన్ 16 నెలల జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలో జనం తన నుంచి ఏం కోరుకుంటున్నారు..? ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి? అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించారు. జగన్ నవరత్నాలను ప్రకటించడానికి బీజం సైతం అక్కడే పడిందని భోగట్టా.
2014 ఎన్నికల్లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది భావించినా టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్ల ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించడం సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే మాత్రం 2014 ఎన్నికల్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఆ సమయంలో చంద్రబాబు రుణమాఫీ హామీని ప్రకటించడం కూడా వైసీపీ స్పీడ్ కు బ్రేకులు వేసింది.
జగన్ 2019 ఎన్నికల్లో మాత్రం సునాయాసంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో జగన్ కు అప్పటి పొలిటికల్ పరిస్థితులు కూడా కలిసొచ్చాయి. జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, రైతుభరోసా, 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. జగన్ సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం ప్రజల ప్రశంసలు అందుకున్నారు. జగన్ ప్రస్తుతం పొలిటికల్ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.