ఆ ఒక్క తప్పుతో నిండా మునిగిన వల్లభనేని వంశీ.. చేసిన పాపాలే పండాయంటూ?

Reddy P Rajasekhar
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ దిశగా అడుగులు పడుతున్న పడుతున్న సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఏ71గా చేర్చారు. వంశీ ప్రోద్బలం వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు భావిస్తుండటం గమనార్హం. పోలీసులు ఇప్పటికే కొంతమంది నుంచి ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారని తెలుస్తోంది.
 
పోలీసులు వంశీ కోసం గాలిస్తుండగా ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ కావచ్చు. పోలీసులు వంశీకి లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుండగా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేమని పోలీసులు చెబుతున్నారు. వంశీ బంధువులు, స్నేహితులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
వంశీ స్వదేశంలో ఉన్నారా? లేదా విదేశాల్లో ఉన్నారా? అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండగా ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసులో వంశీ ఏ71గా ఉండగా పోలీసులు వంశీని ఏ1గా మార్చాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టడం అప్పట్లో ఒకింత సంచలనం అయింది.
 
వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లోకేశ్ గురించి ఇష్టానుసారం కామెంట్లు చేయడమే ఆయన ప్రస్తుత పరిస్థితికి కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వల్లభనేని వంశీ పాపాలు పండాయని ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వంశీ పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: