సీఎం కొడుకైన లోకేశ్ ను చిత్తుగా ఓడించిన ఆళ్ల.. మంగళగిరిలో గెలుపు వెనుక మిస్టరీ ఇదే!

Reddy P Rajasekhar
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలు ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కనీవిని ఎరుగని సీట్లతో విజయం సాధించగా టీడీపీ 23 స్థానాలకు, జనసేన ఒక స్థానానికి పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ప్రజల్లో ఊహించని స్థాయిలో ఆసక్తిని కలిగించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అనే ప్రశ్నకు మంగళగిరి పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి నారా లోకేశ్ పోటీ చేయగా వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణరెడ్డి పోటీ చేశారు.
 
ఎన్నికలు జరిగే సమయానికి లోకేశ్ సీఎం చంద్రబాబు కొడుకు కావడం, మంత్రి కూడా కావడంతో సులువుగానే లోకేశ్ కు విజయం దక్కుతుందని చాలామంది భావిస్తారు. ఎన్నికల ప్రచారం కోసం అప్పట్లో లోకేశ్ పడిన కష్టం సైతం అంతాఇంతా కాదనే సంగతి తెలిసిందే. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉండటం, ప్రజలతో మమేకం అవుతూ సమస్యలను పరిష్కరిస్తూ ఉండటం ఆయనకు కలిసొచ్చింది.
 
2019 ఎన్నికల సమయంలో జగన్ వేవ్ ఉండటం, నవరత్నాల పథకాలకు ప్రజలు ఆకర్షితులు కావడం కూడా ఆ సమయంలో లోకేశ్ గెలుపునకు బ్రేకులు వేశాయని చెప్పవచ్చు. మంగళగిరిలో లోకేశ్ గెలుపు వెనుక మిస్టరీ ఇదే కావడం గమనార్హం. నారా లోకేశ్ రాజకీయాలకు అప్పటికి కొత్త కావడం కూడా ఆ సమయంలో లోకేశ్ కు ఒకింత మైనస్ అయింది.
 
అయితే నారా లోకేశ్ మాత్రం ఎన్నికల్లో ఓటమిపాలైనా కృంగిపోలేదు. ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గెలిచి నారా లోకేశ్ సత్తా చాటాడు. నారా లోకేశ్ 2024 ఎన్నికల్లో గెలుపుతో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. నారా లోకేశ్ భవిష్యత్తులో కూడా పాలిటిక్స్ లో మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులలో నారా లోకేశ్ ఒకరు కావడం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: