రేవంత్‌ దూకుడు.. జెట్‌ స్పీడ్‌తో కొత్త మెట్రోల నిర్మాణం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో కొత్తగా తలపెట్టిన మెట్రో రైల్‌ కారిడార్ల నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. మార్చి నెలాఖ‌రుకు మెట్రోల డీపీఆర్లు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శామీర్ పేట్‌- మేడ్చల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. హెచ్‌జీసీఎల్ కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేయాలన్నారు.

ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చల్ మెట్రో మార్గాల‌ డీపీఆర్ లు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌ లైన్‌ విధించారు. మెట్రోల డీపీఆర్ లకు కేంద్రం ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మెట్రో మార్గాల భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భ‌విష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: