డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒకప్పటి మార్క్ లేదని ఈయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలు చూస్తే అర్థమవుతుంది.రోబో తర్వాత ఈయన చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. రోబో 2.0, స్నేహితుడు, ఇండియన్ -2 ఈ సినిమాలు శంకర్ కెరీర్ ని ఎంత దెబ్బ కొట్టాయో చెప్పనక్కర్లేదు.గత ఏడాది ఇండియన్ టు మూవీ అయితే శంకర్ కెరియర్ పై భారీ దెబ్బ కొట్టింది.ఇక ఈ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ సినిమాపై కూడా పడుతుందని చాలామంది భయపడుతున్నారు. కానీ ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉండడంతో మళ్లీ శంకర్ దారిలోకి వచ్చారని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్-2 మూవీ ప్లాఫ్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. శంకర్ డైరెక్షన్లో వచ్చే చాలా సినిమాలకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించేవారు.
అలా వీరి కాంబోలో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టేవి. కానీ గత కొద్ది రోజులుగా ఏఆర్ రెహమాన్ శంకర్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు మ్యూజిక్ అందించడం లేదు.ఇండియన్ టు సినిమా కూడా అనిరుధ్ ని తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అలాగే ఒకప్పుడు శంకర్ సినిమాలకు సుజాత స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసేవాడు. కానీ ఆయన మరణంతో శంకర్ సినిమాల్లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. అంతేకాకుండా ఇండియన్ టు ఫ్లాప్ కి మరొక ముఖ్యమైన కారణం రెండు పడవల ప్రయాణం చేయడమే.ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమా పైనే ఫోకస్ ఉండాలి తప్ప మరో సినిమా వైపు వెళ్లద్దు. కానీ శంకర్ మాత్రం ఓవైపు గేమ్ చేంజర్ చేస్తూ మరొకవైపు ఇండియన్ టు తెరకెక్కించారు.
ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం వల్లే శంకర్ ఇండియన్ టు భారీ ఫ్లాప్ అయింది. ఇక శంకర్ భారతీయుడు 2 మూవీలో గ్రాండ్ విజువల్స్ చూపించినప్పటికీ అది రియాల్టీగా అనిపించకపోవడంతో సినిమాలో మ్యాజిక్ మిస్ అవుతుంది.అలాగే శంకర్ చేస్తున్న మరో తప్పు ట్రెండుకు తగ్గట్టు తన డైరెక్షన్ మార్చుకోకపోవడమే. ఎప్పుడు ఒకే రకమైన స్టోరీ తో వస్తే కూడా ప్రేక్షకులు ఆదరించారు. అలా భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్ టు మూవీ అట్టర్ ప్లాప్ కి కారణం శంకర్ చేసిన కొన్ని మిస్టేక్స్ అని అర్థమవుతుంది. ఇక ఈ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మూవీపై పడకూడదని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీతో డైరెక్టర్ శంకర్ మళ్ళీ కం బ్యాక్ అవుతాడా తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమా గనుక ప్లాఫ్ అయితే శంకర్ సినిమాలపై అందరికీ నమ్మకం పోతుంది