బండ్లను బుజ్జగిస్తున్న రేవంత్ సర్కార్ ?
ఎందుకంటే నెల రోజుల కిందట గులాబీ పార్టీని వీడి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్... కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... కండువా కప్పి మరి... కాంగ్రెస్లో చేర్చుకున్నారు. అంతేకాకుండా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి... ఆఫర్లు ఇచ్చారట. పార్టీలో చేరగానే అన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారట.
అయితే కండువా వేసుకున్న తర్వాత... గద్వాల ఎమ్మెల్యే పండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అసలు ప్రాధాన్యత కాంగ్రెస్లో ఇవ్వడం లేదట. కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవారు... బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తొక్కేసారట. దీంతో అలిగిన మన కృష్ణ మోహన్ రెడ్డి వెంటనే... గులాబీ పార్టీ టచ్ లోకి వెళ్లారు. మొన్న అసెంబ్లీలో కేటీఆర్ తో కలిసి పార్టీలో చేరుతానని ప్రకటించారు. అయితే దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది.
బండ్లతో పాటు... కాల యాదయ్య కూడా గులాబీ పార్టీకి వెళ్తానని తిరుగుతున్నాడట. అయితే అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తే బాగుండదని.. రంగంలోకి జూపల్లి కృష్ణారావు దిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి... బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేసి మరీ.. బుజ్జగిస్తున్నారు మంత్రి జూపల్లి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇతర ఎమ్మెల్యేలు అసలు మాట వినరని భయపడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక అటు 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కూడా డిన్నర్ ఏర్పాటు చేసి... భరోసా ఇస్తున్నారు.