ఏపీలో ఏకంగా రూ.75 వేల కోట్ల పెట్టుబడి.. టీజీ భరత్ మంత్రిగా సత్తా చాటుతున్నారుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాబు ఇచ్చిన మాటను పూర్తిస్థాయిలో నిలబెట్టుకునే దిశగా అడుగులు మాత్రం పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏకంగా 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి రాబోతుందని మంత్రి టీజీ భరత్ తాజాగా కామెంట్లు చేశారు.
 
టీజీ భరత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏపీకి అంత ఎక్కువ మొత్తంతో పెట్టుబడి వస్తే మాత్రం రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులకు మేలు చేకూరే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం టీజీ భరత్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఏపీకి బీపీసీఎల్ తో పాటు మరో 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కంపెనీ రాబోతుందని టీజీ భరత్ అన్నారు.
 
కంపెనీ పేరును ఇప్పుడే వెల్లడిస్తే ఇతర రాష్ట్రాలు ఆ కంపెనీని పట్టుకెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తానని టీజీ భరత్ పేర్కొన్నారు. 75 వేల కోట్ల రూపాయల కంపెనీని రాష్ట్రానికి రప్పించడం అంటే సులువైన విషయం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
టీజీ భరత్ కు పరిశ్రమల శాఖా మంత్రిగా పదవి ఇచ్చి బాబు మంచి పని చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో భరత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరిన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీజీ భరత్ పై నిరుద్యోగులు మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తుండటం గమనార్హం. చంద్రబాబు సైతం రాష్ట్రానికి కంపెనీలు రావడంపై ప్రత్యేక దృష్టికి రావాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మెరుగైన పాలన అందిస్తే 2029 సంవత్సరంలో కూడా ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: