సినీ రాజకీయం గొడవలు: అన్న బ్రతిమిలాడాడు.. తమ్ముడు సాధించాడు.. సినిమా వాళ్ళ కష్టాలు తీరినట్టేనా.?

Pandrala Sravanthi
-ఆనాడు సినిమా వాళ్ళకి సహకరించని జగన్..
- ఇండస్ట్రీ కష్టాల గురించి జగన్ ను బ్రతిమిలాడిన చిరంజీవి..
- కూటమి ప్రభుత్వంలో సినిమా వాళ్ళ కష్టాలు తీరినట్టే.!

సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం అని సినిమా తీసే వాళ్లకి ఎలాంటి కష్టాలు ఉండవని చాలామందికి అనిపిస్తుంది. మనల్ని నవ్వించడం కోసం వాళ్లు ఎన్నో కష్టాల్ పడుతూ ఎంతో ఖర్చు కూడా చేస్తారు. ఒక్కోసారి సినిమా బోల్తా కొడితే చివరికి జీవితాలు కోల్పోయినటువంటి హీరో హీరోయిన్లు,దర్శకులు నిర్మాతలు ఉన్నారు. అలా కత్తి మీద సాములా ఉండే సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు భయపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళే రాజకీయ నాయకులకు సాగిలపడే అవకాశం వస్తుంది. ఒకప్పుడు సినిమా చూడాలి అంటే తప్పక థియేటర్ కి వెళ్లి మాత్రమే చూడాలి. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ఏం చేసినా చాలా క్రేజీగా ఉండేది. వాళ్లు ఒక్క మాట మాట్లాడితే ప్రజలకు ఈజీగా వెళ్ళిపోయేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయి థియేటర్ కి వెళ్లడం కూడా మానేసారు ప్రజలు. దీంతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సినీ రంగంపై రాజకీయ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. టికెట్ రేట్లను కూడా పెంచకుండా కట్టడి చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలపై ఈ ప్రభావం పడుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీ వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. టికెట్ల రేట్ల విషయంలో అడ్డుకున్నారు. దీనిపై చిరంజీవి ఇతర సినిమా రంగంలోని వారంతా వెళ్లి జగన్ ను కలిసి ఏం మాట్లాడారు ఎలా బ్రతిమిలాడారు అనే వివరాలు చూద్దాం.
 జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి,మహేష్ బాబు, ప్రభాస్ ఇతర సినీ ప్రముఖులంతా సినిమా కష్టాల గురించి చెప్పారు. ప్రస్తుత కాలంలో ఓటిటి ఇతర యాప్స్ రావడం వల్ల  ప్రజలు థియేటర్లోకి వెళ్లడం మానేశారని, వారిని థియేటర్లోకి రప్పించడం కోసం అనేక విజువల్ ఎఫెక్ట్ ఉన్నటువంటి సినిమాలు తీస్తున్నామని,దాని వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రజలు వచ్చే ఒకటి రెండు వారాల్లోనే పెట్టిన డబ్బంతా వసూలు చేసుకోవాలని, లేదంటే సినీ ఇండస్ట్రీ బతకడం కష్టమని  జగన్మోహన్ రెడ్డికి అర్థం అయ్యేలా చెప్పారు. చిరంజీవి సినిమా కష్టాల గురించి జగన్ కు విపులంగా చెబుతూ చివరికి ఆయన కి దండం పెట్టి మరీ బ్రతిమాలాడారు.  అయినా జగన్ మాత్రం కాస్త స్పందించి స్పందించినట్టు ఉన్నారు. అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లపై ప్రభుత్వాలు కాస్త అనిచిత ధోరణి ప్రదర్శించాయి.

కానీ ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దాంట్లో ఎక్కువ మంది సినీ ప్రముఖులే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఆయనకు తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి పనులైనా సరే ఈజీగా  చేస్తారు. ఏ విషయంలో కానీ ఇతర ఏ విషయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పూర్తి స్వతంత్రత ఇస్తారు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి  పూర్తిగా సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో గత ఐదు సంవత్సరాలు తెలంగాణలో గత పది సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి మరియు రాజకీయ నాయకులకు మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు సినీ వాళ్లకి మద్దతుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: