ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద ఐరెన్‌లెగ్... రోజా కాదు ఆ వైసీపీ లీడరే..?
గత నాలుగు ఎన్నికలలోను సునీల్ ఏ పార్టీ నుంచి పోటీ చేసిన తాను ఓడిపోవడంతో పాటు ఆ పార్టీ కూడా చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. ప్రముఖ పారిశ్రమకు వేత్తగా ఉన్న సునీల్ 2009 ఎన్నికలలో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికలలో కాకినాడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల నాటికి సునీల్ వైసీపీలో చేరి మల్లి కాకినాడ పార్లమెంటుకి పోటీ చేసి మళ్లీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. దురదృష్టం ఏంటంటే వైసీపీతో విభేదించిన సునీల్ 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆ ఎన్నికలలో టిడిపిలో చేరి టిడిపి నుంచి పోటీ చేసి వంగా గీత చేతిలో మూడోసారి కూడా స్వల్ప తేడాతో ఓడిపోయారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో వెంటనే సునీల్ తిరిగి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక తాజా 2024 ఎన్నికలలో సునీల్ కాకినాడ పార్లమెంటుకు మరోసారి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో మాత్రం భారీ తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఇలా నాలుగు ఎన్నికలలో మూడు పార్టీల నుంచి పోటీ చేసిన సునీల్ నాలుగు సార్లు కూడా ఎంపీగా ఓడిపోయారు. సునీల్ ఏ పార్టీలో ఉంచి పోటీ చేసినా ఆ పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద ఐరన్ లెగ్ ఎవరు ? అంటే అందరూ సునీల్ పేరు చెబుతున్నారు.