ఏపీ: వన్స్ మోర్ అంటున్న సీఎం చంద్రబాబు..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మార్క్ కనిపించేలా పాలనలో వేగంగా అడుగులేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే పలు కీలక పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెన్షన్స్ అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బాబు.రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. పింఛన్ కింద గత ప్రభుత్వం 3,000 రూపాయలను చెల్లించగా.. ప్రస్తుతం ఈ మొత్తం 4,000 రూపాయలకు చేరింది.పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలయింది. అంటే- ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపింది. ఇక ఈ నెలలో చెల్లించాల్సిన 4,000లకు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను అర్హులైన లబ్దిదారులకు మంజూరు చేసింది.


వికలాంగులకు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపయింది. ఈ మొత్తం కూడా నేటి నుంచే పంపిణీ చేస్తోన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ ఛైర్‌కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి 5,000లను ప్రభుత్వం చెల్లిస్తోండగా.. ఇప్పుడది 15,000 రూపాయలకు పెరిగింది.కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం 5,000ల నుంచి 10,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.సామాజిక భద్రత కింద చెల్లించే పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది.ఈ నేపథ్యంలోనే మరోసారి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. ఆగస్టు 1న మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు.. గుండుమలలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూర రెడ్డి,కందికుంట వెంకటప్రసాద్ తదితరులు హాజరయ్యారు.ఈ క్రమంలో సూపర్ 6అమలుపై ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయటం ద్వారా విమర్శలకు చెక్ చెప్పనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: