2026 వరకు నో డేట్స్.. ఒకేసారి అన్ని సినిమాలు లైన్ లో పెట్టిన నాని..!?

Anilkumar
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29 న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 24.11 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండు రోజుల్లో 36 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజుతో కలుపుకొని 52.18 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నాలుగో రోజున 68.52 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ లెక్కలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు డీవీవీ బ్యానర్ వారు స్పెషల్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు. ఈ వారం నానీకి పోటీ ఇచ్చే తెలుగు సినిమాలేవీ బరిలో కనిపించడం లేదు.

 అందువలన ‘సరిపోదా శనివారం’ జోరు వసూళ్ల పరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇలా హిట్ కొట్టాడో లేదో అలా మరో సినిమా షురూ చేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 చేస్తున్నాడు నాని. ఈ సినిమాను హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2025 మే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడే సుజిత్ డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు నాని. సో సుజిత్ సినిమా ఎలా లేదన్నా 6 నెలలు టైం పడుతుంది. దానితో పాటుగా నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇక నానితో నెక్స్ట్ సినిమా

 చేయాలి అంటే అది 2026 లోనే కుదురుతుంది. ఓ పక్క బడా హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో రెండు మూడేళ్లు టైం తీసుకుంటుంటే ఇటు నాని కూడా వరుస సినిమాలతో క్యలెండర్ ఫిల్ చేసుకున్నాడు. అంతేకాకుండా నాని కొత్త సినిమా చేయాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే అని చెప్పొచ్చు. టైర్ 2 హీరోల్లో నాని మాత్రం సూపర్ జోరు కొనసాగిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: