"శాంతి, డీఎన్ఏ" అంటూ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి .!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు గడిచింది. దీంతో ఈ ప్రభుత్వ హయాంలోనే ఒకరిద్దరూ అమ్మాయిలపై అఘాయిత్యాలు, వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. ఇదే తరుణంలో ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకొని వైసిపి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం వచ్చాకే శాంతిభద్రతలు లోపించాయని  అంటున్నారు. ఇదే తరుణంలో విజయసాయిరెడ్డి కూడా  శాంతిభద్రతల విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని, రాష్ట్రంలో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  


దీనిపై స్పందించినటువంటి టిడిపి కూటమి హోం మంత్రి అనిత విజయసాయి రెడ్డి కి షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై దారుణమైనటువంటి సెటైర్ వేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సాయి రెడ్డి  హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదంటూ ట్వీట్ చేశారు. ఇదే టైంలో "బొల్లి" మాటలతో కాలక్షేపం చేయడంతో రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని, బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ పరిస్థితి నెలకొందని ,దీనికి బాధ్యత హోం మంత్రిదేనని విజయసాయిరెడ్డి అన్నారు.


ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై రీ ట్వీట్ చేసినటువంటి హోం మంత్రి  "శాంతి" భద్రతల విషయంలో మీరు రాజీనామా చేయాలో నేను రాజీనామా చేయాలో కాలమే నిర్ణయిస్తుందని  అనిత ట్వీట్ చేశారు. వీటిలో శాంతిభద్రతలో "శాంతి"కి  ఇలా రెండు కోట్స్ పెట్టడంతో  ఆమె దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టాపిక్ గురించి ఎత్తారనే చర్చ నడుస్తోంది. మాది డీఎన్ఏ సర్కార్ కాదని,ఎన్డీఏ సర్కార్ అని  మా పాలలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిమధ్య జరిగిన ఈ ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: