రేవంత్ సర్కారు తొలి బడ్జెట్ పూర్తి చిట్టా ఇదే!

Suma Kallamadi
ఇరు తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. తెలంగాణలో కెసిఆర్ గత పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక గత పదేళ్ల ఆంధ్రాని చూసుకుంటే, రెండు ప్రభుత్వాలు ఇక్కడ మారినప్పటికీ అభివృద్ధి కొంటుపడింది అనడంలో సందేహమే లేదు. ఇక దీనికి కారణం ఏమిటని విశ్లేషించుకున్నప్పుడు... ముఖ్యంగా అందరికీ వినబడే ఒకే ఒక్క మాట బడ్జెట్. అవును, ఇరు తెలుగు రాష్ట్రాలు విడిపోయే నాటికి బడ్జెట్ విషయంలో ఏపీ కంటే తెలంగాణ మెరుగైన పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలోనే మనకి తెలంగాణ బడ్జెట్ ఏమిటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

దీనికి కారణం హైదరాబాద్ వంటి మహానగరం తెలంగాణ కలిగి ఉండటమే అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ సొత్తుగా మారిన తర్వాత అక్కడ నుండి వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణకే చెందింది. మరోవైపు రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదే తొలి స్థాయి బడ్జెట్ కావడంతో ఏమిటి? ఎంత? అనే మాటలు విరివిగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గురువారం రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రకటిస్తూ... 2,91,159 కోట్ల రూపాయలుగా చెప్పుకొచ్చారు.

ఇందులో మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలు కాగా పన్ను నుండి వచ్చిన ఆదాయం మొత్తం 1,38,181,26 కోట్ల రూపాయలు. ఏ విధంగా కేంద్ర పన్నుల్లో వాటా వచ్చేసి 26,216,28 కోట్ల రూపాయలు కాగా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు 21,636,15 కోట్ల రూపాయలుగా చెప్పుకొచ్చారు. ఇక బడ్జెట్లో అత్యధిక శాతం వ్యవసాయ రంగానికి సుమారుగా 72'659 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75,577 కోట్ల రూపాయల అప్పు ఉందని రేవంత్ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 42 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్లు కూడా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: