బాబుపై తిరుగుబాటు... జగన్ తో రఘురామ కాంప్రమైజ్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...  ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...  

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, లోక్సభ ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ నాయకులు అందరిని ఢిల్లీకి తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయనంది వైసిపి.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. గతంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉండేది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణ రాజు ఇద్దరు దగ్గరయిపోయారు.

అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన రోజున.. జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణరాజు ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకొని పక్కపక్కనే కూర్చున్నారు. ఓటమి, గెలుపుల గురించి చర్చించుకున్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా కోరారు రఘురామకృష్ణరాజు. దానికి సరేనని జగన్ మోహన్ రెడ్డి తల ఊపడం జరిగింది. దీనికి సంబంధించిన సంఘటన గత రెండు రోజులుగా వైరల్ గా మారింది.

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేలా రఘురామకృష్ణ రాజు కీలక ప్రకటన చేశారు.ఇకపై జగన్మోహన్ రెడ్డిని చాలా గౌరవంగా.. పిలుస్తానని ఈ రఘురామకృష్ణ రాజు ప్రకటించారు. గతంలో తనను అరెస్టు చేయడం అలాగే చంపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని  రెస్పెక్ట్ లేకుండా తిట్టానని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇకపై అలా చేయనని తాజాగా ప్రకటించారు.  అయితే మంత్రి పదవి లేదా స్పీకర్ పదవి ఇస్తానని చంద్రబాబు రఘురామకృష్ణ రాజుకు హ్యాండిచ్చిన నేపథ్యంలో... తన నిరసనను జగన్ రూపంలో.. రఘురామా చూపిస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: