తన కంటిని తనే పొడుచుకుంటున్న జగన్.. గందరగోళం సృష్టిస్తే వైసీపీకే నష్టమా?
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా జగన్ సాధించేది ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్పీకర్ మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన సమయంలో వైసీపీ నేతలు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే మంచిదని అలా చేయకుండా సభలో ఇష్టానుసారం వ్యవహరిస్తే మాత్రం జగన్ కే నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు సభలో మంచిగా వ్యవహరిస్తే మాత్రమే పార్టీకి మంచిది.
వైసీపీ నేతలు తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మిగతా రోజులు డుమ్మా కొడితే కూటమి నేతల నెత్తిన పాలు పోసినట్టు అవుతుందని చెప్పవచ్చు. కూటమి నేతలు సైతం వైసీపీ సభలో లేకపోతే ప్రశాంతం అని ఫీలవుతున్నారు. వైసీపీ నేతలు అసెంబ్లీలో వ్యవహరించే తీరు చూడటానికి యావత్ భారతదేశం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వైసీపీ నేతలు తెలివిగా అసెంబ్లీ సమావేశాలలో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కు సొంతవాళ్లు ఎవరో పరాయి వాళ్లు ఎవరో కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరిని దూరం పెట్టాలో ఎవరిని దగ్గరకు చేరదీయాలో తెలుసుకోవాల్సిన బాధ్యత సైతం జగన్ పై ఉంది. 2029 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని చెబుతున్న జగన్ పార్టీ గెలవడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సమావేశాలకు ఇబ్బంది కలిగిస్తే జగన్ తన కంటిని తానే పొడుచుకున్నట్టు అవుతుంది. వైసీపీ ప్రజల మెప్పు పొందే నిర్ణయాలతో మాత్రమే ముందడుగులు వేస్తే పార్టీకి తిరుగుండదని చెప్పవచ్ఛు. జగన్ భవిష్యత్తులో మళ్లీ పాదయాత్ర చేస్తారేమో చూడాలి.