చంద్రబాబుకు షాక్.. విలన్ లా మారిన టీడీపీ ఎమ్మెల్యే?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారుల బదిలీలు, ట్రాన్స్ఫర్లు, సంక్షేమ పథకాల అమలు, పేర్ల మార్పులు ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. గత నెల రోజుల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దూసుకు వెళ్తోందని అందరూ అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చింది.
 ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు కు...  టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు  తలనొప్పిగా మారుతున్నారు. మొన్న వైసీపీ నేతకు సంబంధించిన.. ఓ బిల్డింగ్ ను కూల్చి వివాదంలో చిక్కుకున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. దగ్గరుండి మరి ఆ భవనాన్ని..  ధ్వంసం చేయించారు ఈ టిడిపి ఎమ్మెల్యే. ఈ సంఘటనలో... టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.
 ఇక ఇప్పుడు తాజాగా రహదారులపై పడిన గుంతలను పూడ్చడంలో... అధికారులు విఫలమయ్యారని నిరసనకు దిగారు శ్రీనివాసరావు.  తిరువూరు మున్సిపాలిటీ సమీపంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో... కుర్చీ వేసుకొని మరీ నిరసన తెలిపారు శ్రీనివాసరావు. ఇటీవల పడిన వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే దీనిపై అధికారులు...  స్పందించడం లేదని సొంత ప్రభుత్వం పైన.. తన నిరసనను వ్యక్తం చేశారు.
 దీంతో సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవానికి జనవరిలోనే ఆ రోడ్డు... బాగు చేసేందుకు రెండు కోట్ల రూపాయల వరకు మంజూరు అయ్యాయట. కానీ అంతలో... ఎన్నికల కోడ్ రావడంతో పనులన్నీ ఆగిపోయాయని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు... ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే ఈ విషయం ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం పైన సొంత ఎమ్మెల్యే నే ఇలా... నిరసన తెలుపడం... ప్రభుత్వానికి నెగిటివ్ పేరు వస్తుందని.. అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: