ఏపీ అసెంబ్లీ: జగన్ బృందం ప్రతిపక్ష ముద్ర వేస్తుందంటారా?

Purushottham Vinay

• అసెంబ్లీ సమావేశాలకు అయిష్టంగా ఉన్న ప్రతిపక్ష వైసీపీ నేతలు 

• అసెంబ్లీలో దూకుడు చూపించడానికి సిద్ధంగా లేని నేతలు  


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: అఖండ విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వం జూలై 23 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ నేతలు హాజరవుతారా అనేది ప్రస్తుతానికి సమాధానం చిక్కని ప్రశ్నగా మిగిలింది.ఎందుకంటే వైసీపీ శాసనసభ్యులు తక్కువ సంఖ్యలో ఉన్నందు వలన అసెంబ్లీకి హాజరుకాకపోవచ్చని తెలుస్తుంది. ఒకవేళ వారు అసెంబ్లీకి హాజరైనా, పార్టీ  ఆర్భాటాలు, మాట్లాడలేని వాళ్ళు లేకపోవడంతో వారి ఉనికి కరువైంది.2024 ఎన్నికలలో చాలా మంది బాగా మాట్లాడగల నాయకులు ఓడిపోవడంతో, పార్టీలో నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి అవకాశాలనేవి కొరవయ్యాయి. ఒకప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే గొంతు చించుకుని దూకుడుగా మాట్లాడే నేతలు చాలా మంది ఉండేవారు.రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తమ దూకుడు మాటలతో అసెంబ్లీలో చర్చలను తారాస్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈసారి అలా కాదు. దారుణమైన ఓటమితో బాగా సప్పబడ్డారు. 


 వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న ప్రముఖ నాయకుడు కాదు. ఇక ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా సైలెంట్ లీడర్‌గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. పైగా ఓడిపోయారు కాబట్టి మాట్లాడే అంత సీన్ లేదు.ఇక ఆలూరు నుంచి తొలిసారి పోటీ చేసిన విరూపాక్షి, పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు, అరకు నుంచి రేగం మత్స్య లింగం, ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ అసెంబ్లీకి కొత్త కావడంతో ఖచ్చితంగా సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది. దర్శి ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంచి వక్త. ఆయన ఎలా మాట్లాడగలరో చూడాలి.ఆయనపై కొంచెం అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన కొంత మేర స్వరం పెంచే అవకాశం ఉంది.ఇక రాజంపేట ఎమ్మెల్యే అయిన ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాల నాగిరెడ్డి పెద్దగా నోరు విప్పే లీడర్లు కారు. ఇక వృత్తిరీత్యా వైద్యురాలైన బద్వేల్‌కు చెందిన దాసరి సుధ అనవసర వాదనలకు దిగే సాహసం చేయకపోవచ్చు. మొత్తానికి ఈసారి అసెంబ్లీలో జగన్ బృందం తన ప్రతిపక్ష ముద్ర వేయలేకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: