చిన్నమ్మ కొత్త ఆయుధం...దెబ్బకు వైసీపీ ఖాళీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ఓడిపోయిన వైసీపీ పార్టీని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ పార్టీని... ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో దెబ్బకొట్టేలా స్కెచ్ వేస్తోంది. అలాగే వైసిపి లో ఉన్న కీలక నేతలను, కేసులు ఉన్న విజయ్ సాయి రెడ్డి, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులను... టార్గెట్ చేసి వైసిపి స్థానాన్ని ఆక్రమించాలని బిజెపి పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఏపీలో ఉన్న వైసీపీ నేతలను ఆకర్షించేందుకు... బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందరేశ్వరికి బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన చిన్నమ్మ...  వైసిపి నేతలను ఆకర్షిస్తున్నారట. ఇక లేటెస్ట్ గా కొంతమంది నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు పురందరేశ్వరి. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరికలు జరిగాయి. అనతరపురం, రాజంపేట, సత్యసాయి నుండి జిల్లాల నుండి బీజేపీలోకి చేరికలు జరిగాయి. వైసిపి నుండి బీజేపీ లోకి పలువురు చేరికలు చోటు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్, పార్లమెంట్‌ సభ్యులు పురంధేశ్వరి మాట్లాడుతూ... బిజెపి పదేళ్ళుగా దేశ ప్రజల కోసం పని చేస్తోందని వెల్లడించారు. దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యమన్నారు. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం మోదీ చేసిన సంక్షేమమేనని... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారు... వరద ఉధృతం అవుతోంది కనుక కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: