అధికారం కోల్పోయినా జగన్ తప్పటడుగులు.. మళ్లీ సీఎం కావడం కష్టమేనా?

Reddy P Rajasekhar
మాజీ సీఎం జగన్ అధికారం కోల్పోయినా ఇప్పటికీ తప్పటడుగులు వేస్తూ పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ అంటే జగన్ జగన్ అంటే వైసీపీ అని అందరూ ఫీలవుతారు. జగన్ తర్వాత వైసీపీలో ఆ స్థాయి నాయకుడు ఎవరనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. వైసీపీ నమ్ముకుని పని చేసిన కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను జగన్ పట్టించుకోలేదు.
 
అందువల్ల ఒకప్పుడు జగన్ నుంచి ఏమీ ఆశించకుండా పని చేసిన వాళ్లు సైతం ప్రస్తుతం జగన్ కు సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ కోసం సొంత డబ్బులు రూపాయి కూడా ఖర్చు చేయరనే అపవాదు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ కోసం డబ్బు ఖర్చు చేసే సాహసం చేసే నేత ఎవరూ లేరని తెలుస్తోంది.
 
జగన్ కార్యకర్తలు దాడుల్లో చనిపోతున్నా ఆశించిన స్థాయిలో రెస్పాండ్ కావడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ను నమ్ముకుని పని చేస్తే ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతలు జగన్ కు వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నారని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారని సమాచారం అందుతోంది.
 
జగన్ ఇప్పటికీ ప్రెస్ మీట్ లకు దూరంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా ప్రశ్నలను ఫేస్ చేయడం ఎందుకని భావించి జగన్ ఈ విధంగా చేస్తున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. జగన్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జగన్ ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని మారాల్సిన అవసరం అయితే ఉంది. కూటమి విమర్శలకు సమాధానం ఇచ్చే విషయంలో సైతం వైసీపీ నేతలు తడబడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: