పిల్లల పెంపకంలో గాడి తప్పుతున్న తల్లిదండ్రులు?

Suma Kallamadi
తల్లిదండ్రులన్నాక పిల్లల విషయంలో ఎంత కేరింగ్ గా వ్యవహరిస్తారో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అతిగా కేరింగ్ చూపిస్తే మాత్రం పిల్లలు పెడదారిన పడే పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు. అతిగా కేరింగ్ చూపించడం పిల్లలకు నిర్బందంలాగా అనిపించడమే కాకుండా వారు సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు అని అంటున్నారు. అదే సమయంలో పిల్లలకు అతిగా స్వేశ్చను ఇవ్వడం కూడా నూటికి నూరుపాళ్లు తప్పే. దీనివల్ల వారు అతి స్వేచ్ఛను కోరుకుంటారు. ఈ క్రమంలో చేయరాని తప్పులు చేస్తూ ఉంటారు. ఈతరం తల్లిదండ్రులను తీసుకుంటే... పిల్లలకు వారు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు... ఒకవేళ ఫోన్ వారి చేతికిచ్చినా వారు అందులో ఏం చూస్తున్నారో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో చూసుకుంటే పిల్లలు కూడా ఫోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడిపోతున్నారు... తద్వారా వారు చెడు మార్గాలు పడుతున్నారు.. దానికి ఉదాహరణగా ఇటీవల ఆంధ్రాలో చోటుచేసుకున్న సంఘటనల్ని చెప్పుకోవచ్చు. పట్టుమని పదేళ్లు నిండని పసివాళ్లు కూడా అటువంటి తప్పులు చేస్తే... సమాజం ఎటు పోతోంది? దానికి బాధ్య ఎవరు వహిస్తారు? తల్లిదండ్రులు కాదా? ఈ విషయంలో ముమ్మాటికీ తల్లిదండ్రులదే తప్పని అంటున్నారు సైకాలజిస్టులు. అందుకే నేటి తరానికి అతి స్వేశ్చను ఇవ్వకుండా... ఏదైనా చిన్న పొరపాటు చేసినా, మందలించి అది తప్పని గట్టిగా చెప్పడం ద్వారా వారు విషయాన్ని అర్ధం చేసుకుంటారని అంటున్నారు.
అదే విషయంలో మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలు హోం వర్క్ చేయడం నుండి తప్పించుకున్నపుడు తల్లిదండ్రులు జోక్యం చేసుకొని పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో వాటిని పూర్తి చేసేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలు ఏమీ నేర్చుకోలేరు... సరికదా చేతకాని వాళ్ళుగా తయారవుతారు. ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడే స్వభావం కలిగి ఉంటారు. అదేవిధంగా పిల్లల్ని కొందరు అదే పనిగా పొగుడుతూ ఉంటారు. అది కూడా అంత మంచిది కాదని అంటున్నారు. మంచి పని చేసినప్పుడు పొగడటం, తప్పు చేస్తే మందలించడం, ఓటమి సమయాలలో ప్రోత్సహించడం వంటివి చేయాలి. ఇలా ప్రతీ విషయంలో కూడా పిల్లల్ని జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ... వారికి తగిన సమయాన్ని కేటాయించి పెంచితే ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: