బాబు బిగ్‌స‌వాళ్లు : 5 ఏళ్ళ పాటు సంసారం చేయాల్సిందే..తేడా వస్తే దబిడి... దిబిడే ?

Veldandi Saikiran

* పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి
* బీజేపీతో సఖ్యత పెంచుకోవాలి
* పదవుల పంపకాల్లో జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి... ప్రజా పాలన పైన దృష్టి పెట్టింది. జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీలు  ఏకమై... అఖండ విజయాన్ని సాధించాయి. ఏపీలో బలంగా ఉన్న వైసిపి పార్టీని నేలమట్టం చేశాయి ఈ పార్టీలు. ఏకంగా 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి... పరిపాలనలో దూసుకు వెళ్తోంది. 30 రోజుల్లో... కూటమి ప్రభుత్వం.. ఇలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు వెళ్ళింది.
అయితే... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఐదేళ్లపాటు.. ఇలా కొనసాగితే... ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ కావడం గ్యారెంటీ. కానీ ప్రస్తుత పరిస్థితులు అలాగ లేదు. జనసేన పార్టీలో ఎంతో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.  ఈనాడు అధినేత సంతాప సభ రోజున... పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా... చంద్రబాబు ప్రకటన వేయించారు. అక్కడితో ఆగకుండా... పెన్షన్ల పంపిణీ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని అవమానిస్తూ... చంద్రబాబు తన ఒక్క ఫోటోను మాత్రమే పత్రికా ప్రకటనలో ఇచ్చారు.
 దీంతో జనసేన పార్టీలో తీవ్ర  అసంతృప్తి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు... పవన్ కళ్యాణ్ పట్ల... దారుణంగా వ్యవహరిస్తున్నారని చాలామంది చర్చించుకున్నారు కూడా. అయితే... దీన్ని పవన్ కళ్యాణ్ కాస్త లైట్ తీసుకున్నారు. ఇక బిజెపి పార్టీ... పట్ల చంద్రబాబు కాస్త సానుకూలంగానే ఉంటున్నారు. కేంద్రంలో మోడీ ఉన్న కారణంగా.. చంద్రబాబు బిజెపిని గెలవడం లేదు. అదే సమయంలో చంద్రబాబుకు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా బిజెపి ప్రవర్తిస్తుంది.
 ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు అవసరం కచ్చితంగా కావాలి. అందుకే బిజెపి కూడా అనిగిమనిగి ఉంటుంది. సమస్యల జనసేన పార్టీతోనే చంద్రబాబుకు ఉంటుంది. కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కారణంగా... జనసేన ను కాస్త... జాగ్రత్తగా చంద్రబాబు కాపాడుకోవాలి.  ఇప్పటికైనా జనసేనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలలో... మార్పులు చేసి...బలమైన శాఖలు ఇవ్వాలి.ప్రతి విషయంలో... పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి చంద్రబాబు. అప్పుడే ఐదేళ్ల సంసారం.. పచ్చగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: