బీజేపీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో ఇండీ కూటమి హవా..!

Pandrala Sravanthi
దేశవ్యాప్తంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత రెండు పర్యాయాలు అద్భుతమైన మెజారిటీతో  అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం  ఈసారి కాస్త డీలాపడింది. బిజెపి భావించిన సీట్లు రాలేదు.  అనూహ్యంగా   ఇండియా కూటమి పుంజుకుంది. దీంతో బిజెపి పార్టీల భాగస్వామ్యం చేసి ఎలాగోలా మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయినా మునిపటిలా మాత్రం వారికి పట్టు లేదని చెప్పవచ్చు. ఈ విధంగా కాస్త చతికిల పడ్డ బిజెపికి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన హవా చూపించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. జూన్ 10వ తేదీన  ఏడు రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.వాటి ఫలితాలు  జులై 13న వెలువడ్డాయి. 


ఇందులో ఇండియా కూటమి మొత్తం 10 సీట్లు గెలుచుకుంది. బిజెపి రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది.  మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు,ఉత్తరాఖండ్ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన తృణముల్ కాంగ్రెస్, డీఎంకె, ఆప్, కాంగ్రెస్ పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు అద్భుత విజయాన్ని సాధించారు. దీంతో బిజెపికి మరోసారి గట్టి దెబ్బ తగిలినట్టు అయింది.ఇక రాష్ట్రాల విషయానికొస్తే..పంజాబ్ లోని జలంధర్ లో గెలవడం ఆప్ కు చాలా కీలకం. సీఎం భగవంత్ మాన్ కు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది.


అంత కీలకమైన కాన్స్టెన్సీలో కూడా 23వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు.  అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ లో నాలుగు చోట్ల ఎన్నికలు జరగగా అన్ని స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులే అద్భుతమైన విజయాన్ని సాధించారు.  ఈ విధంగా ఇండియా కూటమి రోజురోజుకు ఎదుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీన్నిబట్టి చూస్తే మాత్రం రాబోవు ఐదు సంవత్సరాల తర్వాత ఇండియా కూటమికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: