వంశీని వణికిస్తున్న లోకేశ్ రెడ్ బుక్.. ఎన్నికల తర్వాత సైలెన్స్ కు కారణాలివేనా?

Reddy P Rajasekhar
ఏపీలో గత కొన్ని నెలలుగా లోకేశ్ రెడ్ బుక్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. తప్పు చేయడంతో పాటు తనను, తన పార్టీని ఇబ్బంది పెట్టి, పరుష పదజాలంతో విమర్శలు చేసిన వాళ్లను లోకేశ్ రెడ్ బుక్ ద్వారా టార్గెట్ చేయడం జరిగింది. లోకేశ్ రెడ్ బుక్ లో కచ్చితంగా ఉన్న పేర్లలో వల్లభనేని వంశీ ఒకరని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మరో విధంగా చెప్పాలంటే లోకేశ్ రెడ్ బుక్ వల్లభనేని వంశీని వణికిస్తోంది.
 
వల్లభనేని వంశీ ఒకానొక సమయంలో లోకేశ్ తల్లిని సైతం ఇబ్బంది పెట్టేలా దారుణంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లోకేశ్ స్థాయిని తగ్గించేలా వల్లభనేని వంశీ చేసిన దిగజారుడు కామెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. గతంలో ఒక సందర్భంలో లోకేశ్ వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడని మంత్రిగా ఉన్న సమయంలో సార్ సార్ అంటుండేవాడని లోకేశ్ పేర్కొన్నారు.
 
పిల్ల సైకో చాలా పెద్ద నటుడని పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తానని లోకేశ్ పేర్కొన్నారు. దొంగ కేసులు పెట్టిన వాళ్లపై జుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని ఆ అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాశామని లోకేశ్ చెప్పుకొచ్చారు. లోకేశ్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వైసీపీ నేతలు చేసిన తప్పులన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరోవైపు జగన్ సైతం తాజాగా రెడ్ బుక్ గురించి స్పందించిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ పేరుతో దొంగ కేసులు పెడుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదని జగన్ చెప్పుకొచ్చారు. లోకేశ్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఆ పరిణామాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ప్రశ్నలకు సైతం జవాబులు దొరకాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: