ఏపీ : 'డియస్సీ' అభ్యర్థులకు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్..?

FARMANULLA SHAIK
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్స్: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52 ఉన్నాయి.అయితే దాంట్లో భాగంగానే ప్రభుత్వం ముందు టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్లో టెట్ మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెట్ ,డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది .ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. టెట్ మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు పలువురు ఎమ్మెల్సీలు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్ కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించిన ఆయన.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్ కు 90 రోజులు మెగా డీఎస్సీ కి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: