బాబు సర్కార్:అమ్మో ఒకటో తారీఖు పోయింది..హమ్మయ్య ఒకటో తారీఖు వచ్చింది.!

Pandrala Sravanthi
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్ పాలన నడిచింది. ఈ పాలన లో ఊర్లలో కేవలం వాలంటీర్లు తప్ప మిగతా ఎవరికి కూడా అంతగా వ్యాల్యూ ఉండేది కాదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కనీసం ఒకటో తారీకు వస్తే జీతాలు కూడా పడేవి కావు. ఇక ఒకటో తారీఖు వచ్చింది అంటే చాలు ఉద్యోగులంతా భయపడి చచ్చేవారు.  జీతాలు పడతాయా లేదా ఈఎంఐలు, రూమ్ రెంట్లు ఎలా కట్టుకోవాలి అని భయపడిపోయేవారు. అలా జగన్ ప్రభుత్వాన్ని మోస్తూ వచ్చినటు వంటి ఉద్యోగులు ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. టిడిపి కూటమి కి సపోర్ట్ చేసి ఓట్లన్నీ చంద్రబాబు కు వేశారు. దీంతో టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. 

ఇదే తరుణం లో చంద్రబాబు నాయుడు కూడా తన మార్కు పాలన చూపిస్తూ వస్తున్నాడు. అందరికీ పింఛన్లు ఒకటో తారీకు అందిస్తూ వచ్చారు.  అంతేకాకుండా జగన్ ఉన్నప్పుడు ఉద్యోగులు ఒకటో తారీకు వచ్చిందంటే జీతం పడుతుందా.. లేదా అని భయపడిపోయేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం లో ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడిపోయాయట. దీంతో ఉద్యోగులంతా సంబరపడిపోతున్నారు. జగన్ పాలన లో చాలావరకు ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారట. జీతాల కోసం పడిగాపులు కాసి కాసి ప్రభుత్వాన్ని విపరీతంగా తిట్టుకునే వారట.

 కానీ ఆ రోజులు పోయాయని చంద్రన్న ప్రభుత్వం వచ్చిందని ఇక ఉద్యోగులకు అన్నీ మంచి రోజులే అంటూ సంబరపడిపోతున్నారట. ఈ ఒకటో తారీకు జీతాలు పడే విధానాన్ని ఇలాగే కొనసాగించాలని ఐదు ఆరు నెలలు మురిపించి మళ్లీ ఎప్పటిలాగే జీతాలు నెలాఖరు లోగా వేయకుండా ఇదే విధానాన్ని కొనసాగించాలి అని ఏపీ ఉద్యోగులంతా కోరుకుంటున్నారు. మరి ఈ ఒకటో తారీకు జీతాలు పడే విధానం ఇలాగే కొనసాగిస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: