అన్న కోసం తమ్ముడి తపన..చిరంజీవికి దేశం గుర్తించే పదవి రానుందా.?

Pandrala Sravanthi
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే  అద్భుతమైన చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని నియోజ కవర్గాల్లో గెలవలేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో, 21 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర కూడా జనసేనానే పోషించింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి తన పంతాన్ని సాధించుకున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే  ఏంటో నిరూపించాడు. అలాగే దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారడని చెప్పవచ్చు. 

అలాంటి పవన్ కళ్యాణ్   గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. అయితే పవన్ కళ్యాణ్ తాను డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి తన పవర్ తో తన అన్న మెగాస్టార్   చిరంజీవికి కూడా కీలకమైన పదవి ఇప్పించేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారట. ఇదే విషయమై కేంద్రంతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించారట. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.  అలాంటి చిరంజీవికి గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఫెయిల్ అయిపోయారు. కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి  కోలుకోకుండా చేశారు.

 పార్టీని ఎవరైతే పాడు చేశారో వాళ్లపై రివేంజ్ తీసుకో వాలంటే, వాళ్ళ అన్నయ్యకు ఏదైనా పెద్ద పదవి ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఎన్డీఏ కూటమితో లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అన్ని వర్కౌట్ అయితే మాత్రం తప్పక మెగాస్టార్  చిరంజీవికి గవర్నర్ లేదంటే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి కేంద్ర అధినాయకులు పవన్  కళ్యాణ్   పెట్టిన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తారా లేదంటే చూద్దాంలే అంటూ దాటవేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: