వైసీపీ దుస్థితికి ఈ ఎనిమిది మందే కారణం.. వాళ్లను నమ్మితే పార్టీ భవిష్యత్తు అంధకారమే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి కారణమేంటనే ప్రశ్నకు ఎంతోమంది కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రధానంగా జగన్ నమ్మిన పలువురు వ్యక్తులు పార్టీకి తీరని నష్టం చేశారని చెప్పవచ్చు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం లేని, జగన్ కు దగ్గరగా ఉండే ఎనిమిది మంది వ్యక్తులు వైసీపీ ఘోర పరాజయం విషయంలో కీలక పాత్ర పోషించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
జగన్ చుట్టూ ఉన్న బలమైన కోటరీ ప్రజలకు, జగన్ కు మధ్య గ్యాప్ పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైందని చెప్పవచ్చు. ప్రజల కోణంలో ఏ మాత్రం ఆలోచించని సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రాజ్ కసిరెడ్డి, రిషిరాజు, కే.ఎన్.ఆర్ వైసీపీ దుస్థితికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఇంకా వీళ్లను నమ్మితే పార్టీ భవిష్యత్తు అంధకారమే అని చెప్పవచ్చు.
 
జగన్ తన చుట్టూ అల్లుకున్న మాయా ప్రపంచం నుంచి బయటకు రావాల్సి ఉందని పార్టీని ముంచేస్తున్న నేతలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ప్రక్షాళన అవసరం అని మరి కొందరు వెల్లడిస్తున్నారు. 2019, 2024 ఎన్నికల్లో అప్పటి వైసీపీకి ఇప్పటి వైసీపీకి మధ్య తేడా ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
 
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటూనే జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ వస్తోంది. కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి వైసీపీ వైపు నుంచి కౌంటర్ ఇచ్చే నేత కూడా లేరని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ పరిస్థితిని తలచుకుని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బాధ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలను జగన్ సైతం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: