పవన్ వ్యక్తిత్వం : ఎలక్షన్స్ ముందు..తరువాత.. అలానే ఉంటే ఫుల్ క్రేజ్ కంపల్సరీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు కలిగిన పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక ఈ పార్టీ 2014 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో పోటీలోకి దిగలేదు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఈ పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. కాకపోతే ఈ దఫా ఈ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో ఈ పార్టీకి 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఇకపోతే ఈ పార్టీ పోటీ చేసింది కూడా కేవలం అన్నే స్థానాలు కావడం విశేషం.

ఇక పవన్ కళ్యాణ్ 2014 నుండి 2024 ఎలక్షన్స్ వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కువ శాతం ఫుల్ జోష్ గానే కనిపిస్తూ ఉండేవాడు. ఏదో కొన్ని సందర్భాలలో సైలెంట్ గా ఉన్నా కూడా ఎక్కువ శాతం ప్రతి పక్షాలపై తనదైన స్థాయిలో విరుచుకుపడుతూ ఉండేవాడు. దానితో పవన్ ఏదైనా సభలో మాట్లాడాడు అంటే అందుకు సంబంధించిన వీడియోలు ఆ తర్వాత వైరల్ గా మారుతూ ఉండేవి. ఇక 2024 లో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రోజు పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి స్థానాలు వచ్చాయి. అలాగే వీరి కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇలాంటి గొప్ప ఫలితాలు వచ్చాక విర్రవీగకుండా పవన్ ఎంతో సౌమ్యంగా ఉంటూ వస్తున్నాడు.

ప్రతి విషయంపై స్పందిస్తూ ప్రజలకు న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాడు. రిజల్ట్ వచ్చి గెలిచిన రోజు కూడా పవన్ ఈ గెలుపు ప్రజలకు న్యాయం చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తాం ఎవరి మీద కక్ష సాధింపు ఉపయోగించమని చెప్పుకొచ్చాడు. ఇలా గెలుపుకు ముందు ఎంతో స్పీడ్ మీద ఉన్న పవన్ గెలుపు తర్వాత మాత్రం చాలా సైలెంట్ గా ఉండడంతో చాలా మంది ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వచ్చే ఐదు సంవత్సరాల కాలం పవన్ ఇలాగే ఉన్నట్లు అయితే ఆయనకు అద్భుతమైన క్రేజ్ దక్కడం పక్క అని చెబుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: