జనం కోసమే జనసేనాని! పార్టీ పేరుకి తగ్గట్టే మారిన పవర్ స్టార్!

Purushottham Vinay

• అధికారంలోకి వచ్చాక జనాలకు బాగా దగ్గరవుతున్న జనసేనాని! 


• ప్రతీకారం కంటే ప్రజా సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిన పవన్! 


• పార్టీ పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న పవన్! 


పిఠాపురం - ఇండియా హెరాల్డ్: ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పార్ట్ టైం జనసేనానిగా ఉండేవారు. అప్పుడు అధికారంలో లేరు కాబట్టి జనాలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఇప్పుడు గెలిచి ఫుల్ టైం జనసేనానిగా మారారు. అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యాక నిన్న మొన్నటి వరకు తన శాఖల పని తీరుపై ఉన్నత స్థాయి అధికారులతో వరుస సమీక్షల్లో గడిపారు. ఇక ఇప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన మొదలుపెట్టారు. ఇక నుంచి 3 నెలల పాటు సినిమా షూటింగులు ఆపేసి జన సేవకి అంకితం అయ్యారు జనసేనాని.తనకు కేటాయించిన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాశాఖ పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఇంకా తాగు నీటి శుద్ధి ప్లాంటుల పని తీరుని స్వయంగా పరిశీలించారు.


ఉప్పాడ తీరానికి పవన్ వస్తున్నారన్న వార్త తెలియడంతో పిఠాపురం ఉప్పాడ మధ్య ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి మరీ పలకరించారు పవన్.తమ కాలనీకి తాగునీటి సమస్య ఉందని, నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుందని అక్కడ నివసిస్తున్న ప్రజలు పవన్ కళ్యాణ్  ఎదుట వాపోయారు. పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద ఉన్న సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పవన్ పరిశీలించారు.100 శాతం ప్రతి ఇంటికీ కూడా తాగునీరు అందించే లక్ష్యం దిశగా పూనుకున్నారు. ఈ కార్యచరణలో భాగంగా ఆ స్టోరేజ్ ట్యాంకును సందర్శించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, శుద్ది చేసిన నీటిని నిల్వ ఉంచే ట్యాంకు ఇంకా నీటి స్వచ్ఛత పరీక్షలు జరిపే పరిశోధనా కేంద్రాలను పరిశీలించి ప్రజల సమస్యని పరిష్కరించే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారాల్లో వైసీపీని కట్టడి చేస్తా అన్న పవన్.. దానికంటే ముందుగా ప్రజా పాలనే ముఖ్యం అనుకోని పార్టీ పేరుకి తగ్గట్టే ప్రజల సమస్య తీర్చే నిజమైన జనసైనికుడిగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: