బ్రిటన్ ఎలక్షన్స్ లో హిందువుల మేనిఫెస్టో..ఆ 2 అంశాలే కీలకం.!

Pandrala Sravanthi
కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందువుల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యంగా బ్రిటన్ దేశవ్యాప్తంగా హిందువులు మొత్తం 10 లక్షల మందికి పైగా ఉన్నారట. దీంతో అక్కడ ఎన్నికల్లో హిందువులదే కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది.  అలాంటి బ్రిటన్ దేశంలో ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికల్లో హిందువుల కోసం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చాలా కీలకంగా మారింది.  మరి ఆ మేనిఫెస్టోలో వారు ఎలాంటి అంశాలు చేర్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. బ్రిటన్ దేశంలో జూలై 4వ తేదీన పోలింగ్  జరగబోతోంది. 

మొత్తం 10 లక్షల మందికి పైగా హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో  వీరి ఓట్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. హిందువుల కోసం  రెండు ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ముందుగా హిందూ ఆలయాల సంరక్షణ మరియు అకారణ విద్వేషాలకు  అడ్డుకట్ట వేసేందుకు  ప్రజా ప్రతినిధులు ప్రధాన చొరవ తీసుకుంటామని మేనిఫెస్టోలో చేర్చారు. హిందువుల ఓట్లే లక్ష్యంగా  ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ  లీడర్ రిషి సునాక్  తన భార్య అక్షత మూర్తితో కలిసి ఆదివారం స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు విలువల గురించి కాసేపు మాట్లాడారు.

రిషి సునాక్ ప్రధాన ప్రత్యర్థి లేబర్ పార్టీ నాయకుడు  కీర్ స్టార్ మార్ ఇండియన్ ప్రజలతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని పట్టాలెక్కిస్తారని ప్రకటన చేశారు. ఈయన కూడా జై స్వామి నారాయణ్ అంటూ నినాదాలు చేశారు. గెలిపిస్తే హిందువుల సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తారని హిందూ పోబియాకు బ్రిటన్ లో చోటు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే తరుణంలో ఎన్నికలకు ముందు వచ్చినటువంటి అన్ని సర్వేల్లోనూ రిషి సునాక్ వెనుకబడి పోయారు. హిందూ ప్రజలను ఆకట్టుకునేందుకు  అనేక ప్రయత్నాలు చేస్తూ  వస్తున్నారు రిషి సునాక్. మరి చూడాలి బ్రిటన్ లో ఇండియన్ మూలాలు ఉన్న ఈయన గెలుస్తారా లేదంటే  కీర్ గెలుస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: