షర్మిల: ఏపీ సీఎం పై షాకింగ్ కామెంట్స్..!

Divya
2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోరం ఓటమిపాలైన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవలే మళ్లీ కాస్త యాక్టివ్ గా మారినట్టు కనిపిస్తోంది.ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు పైన కూడా పలు రకాల కీలకమైన అంశాలను వెల్లడించింది. అలాగే పోలవరం నిర్మాణం పైన కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది షర్మిల.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మోడీ పైన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు పైన ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన విషయాలను స్పందించింది.

ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పోలవరం ప్రాజెక్టు పైన స్పందిస్తు.. ఇటీవలే వైసిపి పాలనలో పోలవరం ప్రాజెక్టు నాశనం అయ్యింది అంటు చంద్రబాబు సైతం ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.. అప్పటినుంచి అటు అధికార పక్షాల మధ్య కూడా మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. గతంలో మోడీ చంద్రబాబు ఒక ఏటీఎం అని చెప్పలేదా అంటూ కూడా వివక్షాలు విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు జాతీయ ప్రాజెక్టు హోదాలో ఉన్న పోలవరం బాధ్యతను సైతం చంద్రబాబు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్లీ తిరిగి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే రావడంతో ఇప్పుడు ఈ అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది.

ఇందులో భాగంగా కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు ఉంటాయి.. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బిజెపి, టిడిపి, వైసిపి పార్టీలే అంటూ షర్మిల మొదలుపెట్టింది.. ఈ ప్రాజెక్టు కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీటి ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయమే అంటూ.. పంతాలకు పట్టింపులకు పోయి జీవనాడి పైన ఇన్నాళ్లు రాజకీయ కుట్ర చేశారు అంటూ తెలిపింది.ఇదే సమయంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరానికి జాతీయ హోదా ఇస్తే మోడీ సర్కార్ ఆ బాధ్యతను పదేళ్లపాటు నిధులు ఇవ్వకుండా విమర్శించింది అంటూ తెలిపారు. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తానే కడతానంటూ పోలవరం సోమవారం అంటూ హడావిడి చేస్తున్న చంద్రబాబు ఐదేళ్లలో చేసింది శూన్యం అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: