కృష్ణ: సినీ, రాజకీయాల్లో దూసుకెళ్లిన డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ రా!

Purushottham Vinay

•సాహసానికి బ్రాండ్ అంబాసిడర్ సూపర్ స్టార్ కృష్ణ!

•అత్యధిక అభిమానులతో సినీ, రాజకీయాల్లో సత్తా చాటిన  సూపర్ స్టార్!

•తిరుగులేని విజయాలు, రికార్డులతో వెలిగిన డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్!

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువ. యావత్ భారత దేశంలో అత్యధిక అభిమానులతో సూపర్ స్టార్ డం అనుభవించిన లెజెండరి సూపర్ స్టార్. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో సేవలందించిన మనసున్న సూపర్ స్టార్. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా టాప్ హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొంది ఎన్నో లక్షల అభిమానులని సంపాదించుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ నే తలదన్నిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. జనాల్లో కృష్ణకి ఉన్న క్రేజ్ చూసి అన్నగారు ఎన్టీఆరే ఆశ్చర్యపోయారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణాకే దక్కుతుంది. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి.

ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో హీరోగా నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన సినిమాలు తీశారు. 1983లో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగా కూడా 16 సినిమాలు తీశారు.అన్నింటిలో నెంబర్ వన్ గా దూసుకుపోయారు.తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే.1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ పీక్స్ లో ఉండేది. ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డులు కృష్ణ క్రియేట్ చేశారు. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు.ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవారు.

కృష్ణ రాజకీయ ప్రవేశం విషయానికి వస్తే.. 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ గారు దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళారు. ఆ సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు. తెలుగుదేశం పార్టీకి రామారావు మాస్ అప్పీల్ లభిస్తోందని, అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తారని కాంగ్రెస్ నాయకులు భావించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కృష్ణ గారు కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు.అయితే 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో cm వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: