జ‌న‌సేన ఫ‌స్ట్ ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్ బ్యాక్‌గ్రౌండ్‌... ఆ హిస్ట‌రీ కూడా ఉందే...?

RAMAKRISHNA S.S.
ఏపీలో కూటమి తిరుగేలేని ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసింది. ఇక వైసీపీకి అనుకోకుండా నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి. కూటమి గెలిచిన వెంటనే నెలరోజులు కూడా కాకుండానే ఏపీలో మళ్ళీ ఎన్నికలకు వచ్చేసాయి. ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ నుంచి గెలిచిన శ్రీ రామచంద్రయ్య, హిందూపురం కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరూ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. వీరిలో రామచంద్రయ్య పార్టీ మారడంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటుపడింది. ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు.

ఈ క్రమంలోనే ఇక్బాల్ ఎమ్మెల్సీ పత్రిక సైతం రాజీనామా చేశారు. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం.. కూటమి తిరుగేలేని మెజార్టీతో ఉండడంతో.. రెండు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇక టీడీపీ నుంచి మరోసారి తన పదవి వదులుకున్న రామచంద్రయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రెండో స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ పేరు ఖరారు అయింది. వీరిద్దరూ మంగళవారం నామినేషన్ వేయ‌నున్నారు. ఇక పిడుగు హరిప్రసాద్ జనసేన నుంచి తొలి ఎమ్మెల్సీగా రికార్డులకు ఎక్కనున్నారు. ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు ఏలూరు లోనే చదివి.. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో న్యాయవిద్య అభ్యసించారు.

ఆయన లా చేసిన జర్నలిజంలో కొనసాగారు. ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ కు మంచి అనుభవం ఉంది. 25 సంవత్సరాలకు పైగా ఆయన మీడియా రంగంలో పనిచేశారు. అందుకే ఎంతోమంది రాజకీయ నాయకులతో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈనాడు గ్రూపు సంస్థలలో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. ఈనాడుతో పాటు ఈటీవీ 2 లోను పనిచేశారు. మాటీవీలో న్యూస్ హెడ్గా పని చేశారు. అదే ఛానల్లో కొంతకాలం అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత సివీఆర్ ఛానల్స్ లో కూడా పనిచేశారు. జనసేన ఆవిర్భావం తర్వాత హరిప్రసాద్ మీడియా రంగాన్ని వదిలిపెట్టి జనసేన పార్టీ మీడియా హెడ్గా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా.. సేవలు అందిస్తున్నారు. ఇక ఇప్పుడు హరిప్రసాద్ జనసేన పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. జనసేన తొలి ఎమ్మెల్సీగా ఆయన పేరు రికార్డుల్లో నిలిచిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: