విజయ్ దేవరకొండ.. రాహుల్ కాంబో మూవీలో అలాంటి పాత్రలో రష్మిక..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు . ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకుంది . దానితో ఈమె క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత పిక్స్ లో ఉంది . ఇక ఈమె కేవలం తెలుగు సినిమా లలో మాత్రమే కాకుండా ప్రస్తుతం అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తుంది . ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే విజయ్ దేవరకొండ హీరో గా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యం లో రూపొందబోతుంది . కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ రాయలసీమ యాస , భాష తెలిసిన నటీనటులు కావాలి అని ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈమె పాత్ర కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఈ భాషలో మాట్లాడడం కోసం రష్మీక ఇప్పటికే ప్రత్యేక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గతంలోనే విజయ్ దేవరకొండ , రష్మిక కాంబినేషన్లో గీత గోవిందం , డియర్ కామ్రేడ్ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో గీత గోవిందం సూపర్ సక్సెస్ సాధించగా , డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక విజయ్ దేవరకొండ , రాహుల్ కాంబోలో ఇది వరకు టాక్సీవాలా అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm

సంబంధిత వార్తలు: