ఏపీ(పిఠాపురం): త్యాగం వల్ల వర్మకు దక్కింది ఏమిటి..?

Divya
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా నిలబెట్టిన ప్రజలు ఎవరంటే పిఠాపురం ప్రజలే.. ఎన్నికల ముందు సినీ సెలబ్రిటీలు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో టిడిపి నేత వర్మ ఆ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో శ్రమించిన చోట వర్మకు ఒక షాక్ లాంటి విషయమని చెప్పవచ్చు. మొదట్లో ఈ పరిణామాలతో వర్మ వర్గ్యులు చాలా నిరసనలు తెలిపినప్పటికీ చివరికి హై కమాండ్ వర్మను పిలిపించి మాట్లాడి సైలెంట్ చేసింది.

అయితే వర్మ సైతం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానంటూ తెలిపారు. ఆయనకు హై కమాండ్ ఆనాడు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి. పవన్ కళ్యాణ్ కూడా వర్మ కు సముచితస్థానం ఇస్తామంటూ తెలియజేశారు. ఇక ఎన్నికలలో కూటమి గెలిచే అధికారంలోకి వచ్చిన తర్వాత పదిరోజులు కాకముందే రెండు ఎమ్మెల్సీ సీట్ల సైతం ఖాళీ అయ్యాయి. దీంట్లో ఒకటి వర్మకు ఇస్తారు అనుకున్నప్పటికీ తీరా చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి సి. రామచంద్రయ్యకు ఒకటి మరొకటి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్ కు ఇవ్వడం జరిగింది.

అయితే టిడిపి జనసేన మధ్య పిఠాపురంలో ఒక తెలియని వార్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం వర్మ పైన కూడా ఒక దాడి జరిగినట్లు ప్రచారాలు వినిపించాయి. పిఠాపురం నియోజవర్గం ఇప్పుడు జనసేన వరం అయిపోయింది. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంగా చెప్పుకొని తిరుగుతున్నారు. అంతేకాకుండా అక్కడ భూమి కొని ఇల్లు కూడా కట్టించుకుంటున్నట్లు సమాచారం. 2029 లో కూడా ఇక్కడి నుంచి వర్మ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రత్యేకంగా ప్రజల కోసం అధికార బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే అటు టిడిపి జనసేన మద్య బంధం ఉన్నంతకాలం వర్మ పిఠాపురాన్ని మర్చిపోవలసిందే అనంతగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: