సీఎం చంద్రబాబు దగ్గరే లంచం అడిగిన అధికారి..! ?
చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలోని ఇంటి స్థలాన్ని... సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారని సమాచారం అందుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఈ సంఘటన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిందట. కుప్పం పరిధిలో ఉన్న శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేశారట చంద్రబాబు నాయుడు.
అయితే అక్కడ జాతీయ రహదారి కూడా ఉందట. అంతేకాదు... చంద్రబాబు కొనుగోలు చేసిన భూమి మొత్తం వ్యవసాయ సాగుకు చేసేది. అయితే.. వ్యవసాయ భూమిలో ఇల్లు కొట్టుకోవడానికి మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ వ్యవసాయ భూమిని.... భూ వినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం tdp నాయకులు గతంలో దరఖాస్తు చేశారట. అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇక ఆ భూమి మార్పిడికి 1.80 లక్షలు లంచం డిమాండ్ చేశాడట డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్.
దీంతో ఆ లంచం.... డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ కు టీడీపీ నేతలు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. తాజాగా శాంతి పురం మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.సద్దాం హుస్సేన్ ను సస్పెండ్ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. ఓ రైతు నుంచి సర్వే పని పూర్తి చేయడానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారని డిప్యూటీ సర్వేయర్ పై ఫిర్యాదు అందిందట. ఇక విచారణలో లంచం అడిగాడని నిజం అని తేలడమే కాకుండా... చంద్రబాబు ఇష్యూ కూడా బయటపడిందట. దీంతో వెంటనే ఆ అధికారిపై వేటు వేశారట. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.