హరీష్ రావును చూస్తే సీఎం రేవంత్ కు వణుకు.. టార్గెట్ వెనుక వ్యూహమిదే.?

Pandrala Sravanthi
 తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు నెలల కాలంలోనే రాజకీయాలన్నీ మారిపోయాయి. తెలంగాణ అంటే కేసీఆర్  అనే స్థాయి నుంచి కాంగ్రెస్ అనే స్థాయికి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇంతలా చితికి పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్ అని చెప్పవచ్చు. వారికి ఉన్న అహంకార ధోరణి వల్లే పార్టీ పూర్తిగా పతనమైంది. కనీసం పార్లమెంటు ఎలక్షన్స్ లో ఒక్క సీట్ కూడా దక్కించుకోలేదు. దీంతో ఆ పార్టీలో గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా పార్టీలు మారుతున్నారు.  బీఆర్ఎస్ లో ఉండే సీనియర్ నేతలు కూడా భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.  అలాంటి ఈ తరుణంలో ఇక మిగిలినటువంటి 30 మంది ఎమ్మెల్యేలను ఎలాగైనా కాపాడుకోవాలని కేసీఆర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయనను ఎవరు నమ్మడం లేదు.

రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ శ్రేణులంతా హరీష్ రావుకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. హరీష్ రావుకి ఇస్తే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉంటారట. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను తీసేసి హరీష్ రావును అనుకుంటున్నారట. ఇదే తరుణంలో  సీఎం రేవంత్ రెడ్డి కూడా  హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి, గేరు మార్చి హరీష్ రావు వెంబడి పడుతున్నారు. కేటీఆర్, కెసిఆర్ హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని  రాజకీయంగా నిలదుక్కుకోవడం కష్టమని హరీష్ రావే పూర్తిగా పార్టీకి బాధ్యతలు వహిస్తారని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావడం ఇష్టం లేదన్నమాట.

కేటీఆర్, కెసిఆర్  పార్టీకి బాసులుగా ఉంటే   పార్టీ పూర్తిగా చతికిల పడుతుంది. దీంతో కాంగ్రెస్ కు మనుగడ ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు.  ఒకవేళ హరీష్ రావు చేతిలోకి తీసుకుంటే మాత్రం ఆయన దూకుడు ప్రదర్శన వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటే కాంగ్రెస్   పరిస్థితి దారుణంగా తయారవుతుందని ముందుగానే గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మధ్య గొడవ సృష్టించాలని, హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్ లను చిన్నగా చూస్తూ  మాట్లాడుతున్నారట. ఇలా చేయడం వల్ల  కేసీఆర్  హరీష్ రావును దూరం పెడతారని,  దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మనగడ ఉంటుందని ఆలోచన చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: