జనసేన తెలంగాణ: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ అలాంటి వ్యాఖ్యలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామికి వెళ్లడం జరిగింది. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి ఈరోజు ఉదయం రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్లారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెంట భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు నుంచి పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు భారీ గాని ఘనస్వాగతం పలికినట్లుగా సమాచారం. అడుగడుగున పూలు చల్లుతూ అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సైతం అభివాదం చేశారు.. సుమారుగా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయంలో కొన్ని గంటలపాటు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తయి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చోటు చేసుకునేందుకు పోలీసులు సైతం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాకతో తెలంగాణలో బిజెపి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బిజెపి కార్యకర్తలు వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ క్రమంలోని తెలంగాణ రాజకీయాల పైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో కూడా బిజెపి, జనసేన పార్టీలు కలిసే పని చేస్తాయంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. దీంతో అభిమానుల సైతం ఒక్కసారిగా జై జనసేన, జై బిజెపి ,జై తెలంగాణ అంటూ పలు రకాల నినాదాలతో అక్కడ దద్దరిల్లేరా చేశారు. కొండగట్టు పర్యటనను సైతం ముగించుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీ నేతలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పార్టీ తెలంగాణలో కూడా చాలా బలంగా ఉన్నదని ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎనిమిది నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు మంచి విజయాన్ని అందుకున్నారు. రాబోయే ఎన్నికలలో బిజెపి జనసేన కూటమి గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ పవన్ అభిమానులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: