తెలంగాణ: కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటున్న సబిత?

Suma Kallamadi
గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అవును, దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లోకి వలసలు రానురాను పెరగడం కెసిఆర్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకులు హస్తం కండువా కప్పుకోవడానికి పోటీ పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చేజారుతున్న నేతల్ని చూసి కూడా పార్టీ అధినాయకత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంత గూటిని వీడి కండువాలు మార్చేస్తున్నట్టు బోధపడక తప్పదు.
అయితే నేతలంతా మూకుమ్మడిగా పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యే లు కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయకపోవడం కొసమెరుపు. ఇటీవలే డిసిసిబి చైర్మన్ అడ్డిబోజారెడ్డి, పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, జైనథ్ జడ్పీటీ నీ తుమ్మల అరుంధతి, బిజెపికి చెందిన ఇచ్చోడ ఎంపీపీ తోపాటు మంచిర్యాల, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నిర్మల్, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణినేతలు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్ర జాప్రతినిధులు మూకుమ్మడిగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ లో కొనసాగి గులాబి తీర్థం పుచ్చుకున్న వారిలో బిఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు తిరిగి సొంత అవసరాల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కనబడుతోంది. ఈ తరుణంలోనే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి 2019 లో టీఆర్ఎస్ పార్టీలో చేరింది. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై గెలిచింది. తరువాత అనూహ్య పరిణామాలమధ్య 2019, మార్చి 14న టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ 2వ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆమెకు విద్యాశాఖను కేటాయించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ మంత్రిగా ఆమె తన ఉనికిని చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: