బీఆర్ఎస్ పార్టీని టైటానిక్ షిప్ లా కూల్చేందుకు బీజేపీ కుట్రలు ?

Veldandi Saikiran
అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ జారుకుంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపి పార్టీలోకి వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. అతి త్వరలోనే టైటానిక్ షిప్ తరహాలో గులాబీ పార్టీ మునిగిపోతుందని బాంబు పేల్చారు  రఘునందన్ రావు. ఇవాళ మీడియాతో బిజెపి ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..గులాబీ పార్టీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్ రాం రెడ్డి లాక్కున్నారని ఫైర్ అయ్యారు.  క్షీర సాగర్ నుంచే పని మొదలుపెడతా.. దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. ITIR ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామని... ITIR ప్రాజెక్టు టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందని వెల్లడించారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. ITIR గురించి తెలిస్తే జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు.

జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉంది... జగ్గారెడ్డి పెరిగింది RSS లో.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అంటూ స్పష్టం చేశారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు.  నీట్ పరీక్ష పై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఉంచబోతోందని చెప్పారు.  మెదక్ కు ఇందిరమ్మ రాకముందే BHEL, ఇక్రిశాట్ వచ్చాయి.... సమ్మిళితంగా మెదక్ ను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని చెప్పారు.  

టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుందని చరిత్రలో రాసుకోవాల్సిందే.... BRS కు... CRS  (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయం అంటూ బాంబు పేల్చారు. హరీష్ రావు, కెసిఆర్ ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తానని పేర్కొన్నారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు.  బయ్యారం, ఖాజీపేట కొచ్ ఫ్యాక్టరీకి ఫీజుబిలిటీ లేదు..  ఫాజిబులిటీ లేదని ఎక్సపెర్ట్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. కేసీఆర్ ఇంటికి ఈడి రాక తప్పదు... అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్నారు  గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్..  కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అంతా కెసిఅర్ పేరే చెబుతున్నారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: