అసెంబ్లీ: జగన్‌ని లాస్ట్ బెంచ్‌కి తోసేసారుగా.. ఆ అవమానం ఎలా భరిస్తారు..??

Suma Kallamadi
రాజకీయాలలో రోల్ రివర్స్ సర్వసాధారణం. అంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఈరోజు అధికారంలోకి రావచ్చు. నిన్నటిదాకా అధికారంలో పేట్రేగిపోయిన సీఎం ఈరోజు పవర్ లేని మామూలు మనిషిగా ఉండిపోవచ్చు. ఓటర్లు అసంతృప్తి కారణంగా వేరే వాళ్లకు ఓటు వేయడం జరుగుతుంది, ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ పార్టీ పూర్తిగా పతనమైంది. 2019 ఎన్నికల్లో 153 సీట్లతో ఆధిక్యత సాధించిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 11 సీట్లకు పడిపోయింది.
అయితే ఈరోజు జగన్ అసెంబ్లీలో హాజరయ్యారు కానీ ఆయనకు లాంచ్ లాస్ట్ కేటాయించారు. ఈ అవమానాన్ని ఆయన ఎలా భరిస్తారో చూడాలి. అలానే జగన్ రాబోయే ఐదేళ్లలో నిలదొక్కుకోవాలి. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో చాలా ఇబ్బందిని భరించాల్సి ఉంటుంది. ఈరోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇది జగన్‌కు, ఆయన పార్టీకి తొలి పరీక్ష. ఘోర పరాజయం తర్వాత జగన్ వస్తాడా లేదా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూడగా ఆ టైమ్ రానే వచ్చింది.
రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉత్తమ స్థానాలతో సహా అత్యధిక ప్రాధాన్యత పొందడం సాధారణం. ప్రతిపక్ష పార్టీకి అధికార పక్షానికి నేరుగా ఎదురుగా కొన్ని సీట్లు ఇవ్వగా, మిగిలిన వారు వెనుక వరుసల్లో కూర్చోవాలి. జగన్ కూడా అలాగే కూర్చోవలసి వచ్చింది ఆ తర్వాత ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2019-24లో, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, తెలుగుదేశం పార్టీకి దాని 23 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో నాలుగు ముందు వరుస స్థానాలు, మరో ఆరు వరుసలు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కారణంగా ఆ పార్టీ అసెంబ్లీ సలహా కమిటీలో కూడా భాగమైంది.
ఇప్పుడు కేవలం 11 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ పరిస్థితి వేరు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎక్కడ కూర్చోవాలో అధికార పార్టీ నిర్ణయిస్తుంది. అదనంగా, టీడీపీ అంగీకరిస్తే వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోగలదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, వైఎస్‌ జగన్‌తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వెనుక వరుసలో కూర్చోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. వ్యాపార సలహా కమిటీలో పార్టీ కూడా భాగం కాదు. ఈ "చివరి వరుస" ఇబ్బందికి వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వెంటనే వెళ్లిపోయారు మరి భవిష్యత్తులో వస్తారా లేదా అని తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: