టీడీపీ : చంద్రబాబు జపం చేస్తున్న కేటీఆర్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో... గులాబీ పార్టీ నేతలు టిడిపి జపం చేస్తున్నారు. చంద్రబాబు గ్రేట్ అంటూ పొగుడుతూనే కాంగ్రెస్ అలాగే బిజెపి నేతలను బండబూతులు తిడుతున్నారు గులాబీ నేతలు. తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా వివాదాలు ఉన్నాయి. కెసిఆర్ అంటే చంద్రబాబుకు పడదు.. చంద్రబాబు అంటే కేసీఆర్ పార్టీ వాళ్లకు పడదు.

చంద్రబాబు పార్టీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్...  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా... పదేళ్లు ముఖ్యమంత్రిగా ఎదిగారు. అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడంలో  కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ఇటు మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు సపోర్ట్ ఇచ్చి.. కెసిఆర్ పై రివెంజ్ తీర్చుకున్నారు బాబు. ఇలా తెలుగుదేశం మరియు టిఆర్ఎస్ పార్టీల మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి.

అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను పొగుడుతూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు ఇస్తే...  కెసిఆర్ ప్రతాపం ఏంటో చూపించే వాళ్ళమని ఎన్నికల ముందు చెప్పాం.. కానీ తమకు ఒక సీటు కూడా  రాలేదన్నారు కేటీఆర్. ఏపీ ప్రజలు... ప్రాంతీయ పార్టీ అయినా టిడిపికి 16 సీట్లు ఇచ్చారు. ఆ దెబ్బకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను... ప్రైవేటీకరణం  చేయకుండా మోడీ ప్రభుత్వం భయపడిపోయిందని కేటీఆర్ తెలిపారు.

కేంద్రాన్ని 16 సీట్లతో తెలుగుదేశం పార్టీ వనికించిందని... కేటీఆర్ స్పష్టం చేశారు.  అచ్చం అలాగే టిఆర్ఎస్ పార్టీకి  తెలంగాణలో ఎక్కువ సీట్లు ఇస్తే... మనం కూడా కేంద్రంలో చక్రం తిప్పే వాళ్ళమని... సింగరేణి బొగ్గు ను వేలం వేయకుండా ఆపే వాళ్ళమని తెలిపారు. టిడిపి వాళ్లు 16 సీట్లు గెలుచుకొని  విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే... చిరు 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు... తెలంగాణ బొగ్గును వేలం వేస్తున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ అలాగే బిజెపిని విమర్శించే నేపథ్యంలో... చంద్రబాబును పొగిడారు. అటు హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి... టిడిపి విజయం... అందరికీ స్ఫూర్తి దాయకంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: