ఈవీఎంలు హ్యాక్ చేయడం సాధ్యమేనా.. ఈసీ ఏం చెప్తుందో తెలిస్తే..??

Suma Kallamadi
భారతదేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ, ఓడిపోయిన పక్షం తరచుగా ఈవీఎంలు నిందిస్తుంది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో చాలా కాలంగా బ్యాలెట్ పేపర్లకు బదులుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈవీఎంల వల్ల వచ్చే సమస్యల గురించి ట్వీట్‌ చేశారు. అయితే, ఈవీఎంలను హ్యాక్ చేయలేమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తేల్చి చెప్పింది.
కేవలం 25 దేశాలు మాత్రమే ఈవీఎంలను ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈవీఎంలు సురక్షితం అని ECI చెబుతోంది. అందుకు అనేక కారణాలను అందిస్తుంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా ఆపడానికి 275 భద్రతా చర్యలు ఉన్నాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ఈసీ ప్రకారం వాటికి ఇంటర్నెట్ పోర్ట్‌లు లేవు, కాబట్టి అవి WiFi లేదా బ్లూటూత్ సిగ్నల్‌లను అందుకోలేవు.  ఈవీఎంలు పరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు అవుతాయి. వీటిని మెరుగ్గా స్టోర్ చేస్తారు. వాటి చిప్‌లు ఒక్కసారి మాత్రమే రైట్ చేయడం కుదురుతుంది రీ రైట్ లేదా రీప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు.
ఈసీ రవాణా సమయంలో ఈవీఎంలను రక్షించడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకునే రోజు వరకు తమకు ఏ బటన్‌ను కేటాయించారో వారికి తెలియదు.  ప్రతి పక్షానికి కేటాయించిన క్రమ సంఖ్య ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతుంది. ఈవీఎంల కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు వీవీప్యాట్‌తో పరీక్షిస్తారు. ప్రతి ఓటు నమోదు కావడానికి 7 సెకన్ల సమయం పడుతుంది, కాబట్టి అదనపు ఓట్లతో ఈవీఎంలను నింపలేరు. అలానే ఏదైనా లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు. అందువల్ల ఈవీఎంలు ఎన్నికల్లో వినియోగానికి చాలా సురక్షితమైనవని ఈసీ వాదిస్తోంది.
మరి జగన్, ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు వీటికి వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారో తెలియడం లేదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ కూటమి 23 నుంచి 164 సీట్లు గెలుచుకోవడం, వైసీపీ 151 నుంచి 11కి పడిపోవడం చాలా ఆశ్చర్యకరం. అయితే ప్రజలు వైసీపీ పాలన కారణంగా విసిగిపోయి టీడీపీకే అన్ని ఓట్లు గుద్ది ఉండొచ్చు. ఓడిపోయినప్పుడు ఈవీఎంలను బ్లేమ్ చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

EVM

సంబంధిత వార్తలు: