ఏపీ: అధికారులపై పయ్యావుల కేశవ్ ఫైర్.. తప్పంతా వారిదే..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తూనే తన కింద 24 మంత్రులను నియమించుకొని వారికి కూడా శాఖలను కేటాయించారు.ఇందులో భాగంగా ఉరవకొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ కి చంద్రబాబు ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు చూసుకోవాల్సిన భాద్యతలు అప్పగించారు. అయితే పయ్యావుల కేశవ్ సోమవారం రోజు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం లో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొని  వైసిపి చేసిన తప్పులను ఎత్తిచూపుతూ టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిన పెడుతుంది అనే విషయం చెప్పుకొచ్చారు. అలాగే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

ఇక ఈయన ఆర్థిక శాఖలో ఎక్స్పర్ట్ సమర్థవంతంగా పని చేయగలడు.కానీ ప్రస్తుతం ఆయనకు చిరాకు పుట్టిస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయట. ఎందుకంటే డబ్బులు ఎక్కువగా కావాలి. కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత వస్తాయి అనేది తెలియదు. అలాగే నెల పూర్తయ్యే లోపు 10,15 వేల కోట్ల డబ్బు కావాలి.కానీ ఈ స్థాయిలో డబ్బులు ప్రస్తుతం లేవు. అలాగే రాష్ట్రంలో ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. దీంతో పయ్యావుల కేశవ్ అధికారులపై చిరాకు పడ్డారు. గత ఐదు సంవత్సరాల లో వైసిపి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వైసిపి ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏ విధంగా ఉందో తెలుసుకుందామంటే ఇప్పటికే ఒక ముఖ్య అధికారి సెలవు పై వెళ్లిపోయారు. మరో అధికారిని అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఆ అధికారి ప్రస్తుతం అందుబాటులో లేరు. కనీసం ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామంటే కొత్త ప్రభుత్వానికి వివరించడానికి కూడా వాళ్ళు సహకరించడం లేదు.దీన్నిబట్టి వైసిపి ప్రభుత్వం ఆర్థిక దురాగతాన్ని  సులభంగా అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వాన్ని గాడిన పెట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పయ్యావుల కేశవ్ ఉరవకొండ విజయోత్సవ సభలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: