ఉచిత బస్సు ప్రయాణం : శభాష్ అనిపిస్తున్న చంద్రబాబు

FARMANULLA SHAIK
•సీఎం కాగానే పని మొదలు పెట్టేసిన చంద్ర బాబు
•ఉచిత బస్సు పథకంతో ఆకట్టుకుంటున్న బాబు

( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగో విడత ఆయన సీఎంగా వారం రోజుల క్రితం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. ఈ వారం రోజుల్లో ఆయన జనాలకు ఉపయోగపడే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పాలన మారిన తర్వాత ప్రజల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. సీఎం కావడంతోనే చంద్రబాబు నాయుడు  కీలక ఫైళ్లపై మొదటి రోజే సంతకాలు చేశారు. ఆ తర్వాత కూడా సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు జనంలో సానుకూల ప్రభావం చూపుతున్నాయి.చంద్ర బాబు నాయుడు చేస్తున్న మంచి పనుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. బస్సు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. పని చేసే మహిళలకు, స్టూడెంట్స్ లకు బస్సు ప్రయాణం చాలా అవసరం. రోజూ వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఆ ప్రయాణాన్ని మహిళల కోసం బాబు ఉచితం చేశారు.సూపర్‌ సిక్స్‌లో కూటమి ప్రభుత్వ హామీ.. అతి త్వరలోనే అమలు కానుంది. ఇక ఈ హామీ ఎప్పుడు అమలవుతుంది..ఎలా అమలవుతుందోనని మహిళలు వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అతి కొద్ది రోజుల్లోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఈ పథకం సాధ్యాలపై అధికారులు కసరత్తుచేస్తున్నారు.ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై అధికారులు గట్టిగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి.. కొత్తగా ఎన్ని బస్సులు అవసరం ఉంటుందనే దానిపై అధికారులు ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. అతి త్వరలోనే ఈ పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో మహిళల ఉచిత రవాణా పథకాన్ని అమలుచేస్తున్న ఆ ప్రభుత్వాలు ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాయి.మన దగ్గర కూడా రాయితీకి అయ్యే వ్యయాన్ని రాష్ట్రప్ర భుత్వం ఆర్టీసీకి చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరడం జరుగుతుంది.దేశవ్యాప్తంగా  ఢిల్లీ, పంజాబ్‌, చెన్నై,బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల తో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: