వంగలపూడి అనిత: ఆంధ్ర గంజాయి ఫ్రీ కానుందా...?

Divya
•ఆంధ్రాను గంజాయి ఫ్రీ చేయడమే ప్రధాన లక్ష్యం..

•వైసీపీకి సపోర్ట్ చేసే అధికారులు రాజీనామా చేయవచ్చు..
•సింహాద్రి అప్పన్న సాక్షిగా ఆంధ్ర ప్రజలకు మంచి చేస్తాం..

(ఆంధ్రప్రదేశ్ -  ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు హోరా హోరీగా జరిగి.. ఉత్కంఠ భరితంగా ఎన్నికల ఫలితాలు వెలువడి.. చివరికి కూటమి విజయ పతాకాన్ని ఎగుర వేసింది. ఇక పలు ప్రాంతాలలో ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో కొంతమంది మంత్రులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. అందులో ముఖ్యంగా వంగలపూడి అనిత.. హోమ్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆంధ్రాను ముందుగా గంజాయి ఫ్రీ చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని తాజాగా ఆమె మీడియాతో వెల్లడించారు..

ఇటీవల సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ఆమెను.. తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామినీ దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు.. సింహాచలం దేవస్థానం భూములలో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.. పంచ గ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు.. ఇకపోతే వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీస్ అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని విమర్శించారు.. ఇప్పటికే వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్లయితే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పని చేసుకోవాలని హితవు పలికారు.
వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ హబ్ గా మార్చారు.. కనీసం పోలీస్ స్టేషన్ ల నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు.. గంజాయి అణిచివేతకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము.. ఇప్పటికే విశాఖలో గంజాయి అక్రమ రవాణాపై 1252 మందిపై కేసులు నమోదయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 300 మందిపై కేసులు ఉన్నాయి. ఇక గంజాయి నివారణ చేయాలి అంటే  ప్రజా సహకారం కూడా కావాలి .. ప్రజలకు మంచి చేసే దృక్పథంతోనే పోలీసులు ఉండాలి.. మూడు నెలల్లోనే వ్యవస్థను గాడిలో పెడతాము ..పోలీసు శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుంది... ఆంధ్రప్రదేశ్ ను  గంజాయి ఫ్రీగా చేయడమే మొదటి లక్ష్యం.. కచ్చితంగా మూడు నెలల్లోనే గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాము అంటూ హామీ ఇచ్చారు ఆంధ్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. మొత్తానికి అయితే అనిత తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి ఈమె హామీ ఇచ్చినట్టుగానే ఆంధ్రా లో గంజాయి లేకుండా చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: