జ‌న‌సేన‌, ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌తో చంద్ర‌బాబు... ఏం చేశారో చూడండి..!

RAMAKRISHNA S.S.
- బాబు ఫొటో ప‌క్క‌న ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌వ‌న్ ఫొటో
- డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి  కూడా జ‌న‌సేన ఖాతాలోకే
- నామినేటెడ్ పోస్టుల్లోనూ గాజు పార్టీ కేడ‌ర్‌కు ప్ర‌యార్టీ
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో టీడీపీ విజ‌యంలో పాలు పంచుకున్న కూట‌మి పార్టీ జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు ఎన‌లేని ప్రాధాన్యం క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. నిజానికి చంద్ర‌బాబు అరెస్టు నుంచి ఎన్నిక ల‌వ‌ర‌కు కూడా.. జ‌న‌సేన కూడా టీడీపీకి అన్ని విధాలా అండ‌గా నిలిచింది. జ‌గ‌న్ స‌ర్కారును గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగులు వేశారు. ఈ క్ర‌మంలో బీజేపీని కూడా అనేక ఇబ్బందులు ప‌డి ఆయ‌న ఒప్పించారు. ఎట్ట‌కేల‌కు టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్లాయి.

జ‌న‌సేన క‌నుక ఈ ప్ర‌య‌త్నం చేయ‌క‌పోయి.. ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని టీడీపీ నాయ‌కులే వ్యాఖ్యా నించారు. మొత్తంగా టీడీపీకి పున‌ర్‌వైభ‌వం తీసుకురావ‌డంతోపాటు.. పార్టీని అధికారంలోకి తీసుకురావ డంలోనూ జ‌న‌సేన పాత్ర ఘ‌న‌మ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా.. ఆ పార్టీకి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం మూడు మంత్రి ప‌ద‌వులు అప్ప‌గించారు. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌విని కూడా ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు అసెంబ్లీలోనూ చంద్ర‌బాబు జ‌న‌సేన కు ప్రాధాన్యం ఇచ్చి.. స‌ముచితంగా గౌర‌వించారు. స్పీక‌ర్‌గా టీడీపీకి చెందిన అయ్య‌న్న పాత్రుడిని దాదాపు ఎంపిక చేసిన చంద్ర‌బాబు.. ఉప స‌భాప‌తి ప‌ద‌విని మాత్రం జ‌న‌సేన‌కు ఇచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. దీనిని కూడా దాదాపు ఆయ‌న ఖ‌రారు చేశారు. దీంతో జ‌న‌సేన త‌ర‌ఫున ఎన్నికైన అభ్య‌ర్థుల్లో ఒక‌రికి.. ఉప స‌భాప‌తి స్థానం ద‌క్క‌నుంది. ఇది రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వి కాక‌పోయినా.. ప్రాధాన్యం ఉన్న స్థాన‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. జ‌న‌సేన నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేరుఈ ప‌ద‌వికి వినిపిస్తోంది. అయితే.. జ‌న‌సేన మ‌హిళా నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతోఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. నెల్లిమ‌ర్ల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఓసీనాయ‌కురాలు.. విద్యావంతురాలు.. లోకం మాధ‌వి పేరును ఈ ప‌ద‌వికి ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. జ‌న‌సేన‌కు ఈ ప‌ద‌వి రిజ‌ర్వ్ చేయ‌డంతో చంద్ర‌బాబు ఇస్తున్న ప్రాధాన్యం అర్థ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: