ఈవీఎంల‌పై న‌మ్మ‌కం పోయింది... జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం లేదు...!

Pulgam Srinivas
భారతదేశంలో స్వతంత్రం వచ్చాక జరిగిన ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్లను వేసేవారు. ఆ పద్ధతినే చాలా సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చారు. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ పరిధి చాలా పెద్దవి కావడం, ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది చాలా వ్యవధితో కూడుకున్న పని కావడంతో దీనిని తగ్గించడానికి దేశంలోకి ఈవీఎం ఓటింగ్ సిస్టంను తీసుకువచ్చారు. ఈ పద్ధతి గురించి మన అందరికీ తెలిసిందే. మనం పోలింగ్ బూత్ లోకి వెళ్లి మనకు కావాల్సిన సింబల్ ఉన్న పక్క బట్టన్ నీ నొక్కాలి.

అలా నొక్కిన సమయంలో అక్కడ ఒక సౌండ్ వచ్చి అందులో మనం ఏ పార్టీకి ఓటు వేయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన స్లిప్ ఆ బాక్స్ లో పడిపోతుంది. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం మిషన్ ను ఒక సిస్టంకు కనెక్ట్ చేస్తారు. అందులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే విషయం చూపిస్తుంది. ఒక వేళ ఆ ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగింది అని అభ్యర్థులకు అనిపించినట్లు అయితే వాటిని మరోసారి లెక్కిస్తారు. ఇక ఈ సిస్టమ్ ఎప్పటినుండి అయితే వచ్చిందో అప్పటినుండి ఎంతోమంది వీటిపై వ్యతిరేకత తెలుపుతూనే వస్తున్నారు.

చాలామంది ఇప్పటికే ఈ పద్ధతి ద్వారా ఓట్లు వేయడం సరికాదు పూర్వపు పద్ధతి అయినటువంటి బ్యాలెట్ పేపర్ ఓటు పద్ధతిని తీసుకురండి అని కోరిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే ఈవీఎంలపై కొంతకాలం క్రితం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.  మహారాష్ట్ర ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగించాలని ఆ సమయంలో ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈవీఎంల పని తీరుపై తమకు ఎన్నో సందేహాలు ఉన్నాయని, ఆయన ఎన్నికల సంఘానికి ఆ సమయంలో వినతిపత్రం కూడా అందజేశారు.

విరు మాత్రమే కాకుండా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేఏ పాల్ కూడా అనేక సార్లు ఈవీఎం ఓట్లను రద్దు చేయండి. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్లు వేసే పద్ధతిని తీసుకురండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరూ మాత్రమే కాకుండా అనేకమంది నేతలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఓట్లు వేయడాన్ని వ్యతిరేకించారు. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా అందుకు సంబంధించిన ఒక పోస్టును కూడా సోషల్ మీడియాలో చేశారు.

న్యాయం జరగడం మాత్రమే కాదు... కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో EVM లు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి." అని జగన్ తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్ రెడ్డి ఈవీఎం సిస్టమ్ పై నమ్మకం లేదు అని ఓ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: