చంద్రబాబు సీఎం అయితేనే పుట్టింటికి వెళ్తానని శపథం మహిళ.. ఏం జరిగిందంటే.?

Pandrala Sravanthi
 తెలుగుదేశం పార్టీకి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి ఈ పార్టీ  అంటే ఎంతో మంది ఇష్టపడతారు. కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ఇప్పటికీ టిడిపి పార్టీ కి అభిమానులు ఉన్నారు. అలాంటి టిడిపి పార్టీని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకొని నడిపిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన చంద్రబాబుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. అలాంటి ఈ తరుణంలో ఒక మహిళ మాత్రం  చంద్రబాబు గురించి ఐదు సంవత్సరాలు పుట్టింటికి వెళ్లకుండా ఉందట. బాబు మళ్ళీ సీఎం అయితేనే పుట్టింట్లోకి అడుగు పెడతానని శపథం చేసి మరీ వచ్చింది. మరి ఆ మహిళ ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దామా..

  ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రం కేశవాపురం గ్రామానికి చెందినటువంటి కట్ట గోపయ్య  సౌభాగ్యమ్మ  దంపతులకు నాలుగవ కూతురుగా విజయలక్ష్మి పుట్టింది. ఆమెకు ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందినటువంటి నరసింహారావు తో పెళ్లి చేశారు. అయితే ఈమె పెళ్లి తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు.  దీంతో వారి సొంత ఇంట్లో విజయలక్ష్మి అక్క వాళ్ళు ఉంటున్నారు.  అయితే విజయలక్ష్మి అప్పుడప్పుడు తన ఇద్దరు పిల్లలతో కలిసి  వచ్చి పోతూ ఉండేది. అలా అయిదు సంవత్సరాల క్రితం ఓ రోజు ఊరికి వచ్చిన ఆమెతో తన అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్ తో రాజకీయంగా వాదనకు దిగింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారని విజయలక్ష్మి అంటే జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాద్ అన్నారు.

ఆ ఇద్దరు వాదించుకున్న తర్వాత కొన్నాళ్లకు జగన్ సీఎం అయ్యారు. దీంతో మనస్థాపానికి గురైనటువంటి విజయలక్ష్మి చంద్రబాబు మళ్ళీ సీఎం అయిన తర్వాతే  ఇక్కడికి వస్తానని ప్రసాద్ తో బెట్ కట్టిందట. అలా అయిదు సంవత్సరాల పాటు తన పుట్టింట్లో అడుగుపెట్టకుండా ఉంది. చివరికి 2024 ఎలక్షన్ లో చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఇక జూన్ 12న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జూన్ 15న విజయలక్ష్మి తన పుట్టింటికి వెళ్ళింది.ఈ విషయాన్ని తన పుట్టింటి వారితో పంచుకోవాలనే ఆనందోత్సాహాలతో పుట్టింటికి వచ్చిన ఆమెకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వారి గ్రామంలోని బస్టాండ్ కూడలి వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ఆమెను ర్యాలీగా తీసుకెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి విజయ లక్ష్మి శపథానికి ముగింపు పలికించారు. ప్రస్తుతం ఇది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: